Newsపవన్ ' OG ' సినిమాకు ఆ రెండు ఫ్లాప్ సినిమాల...

పవన్ ‘ OG ‘ సినిమాకు ఆ రెండు ఫ్లాప్ సినిమాల కనెక్షన్.. ఫ్యాన్స్‌లో ఒక్క‌టే భ‌యం…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలలో ఎక్కువగా నటిస్తున్నారని కొంతమంది కామెంట్లు చేసినా ఈ జనరేషన్ లో రీమేక్ సినిమాలతో హిట్లు అందుకుంటున్న హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పాలి. ప్రస్తుతం పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ 2024 మే తర్వాత షూటింగ్ లలో పాల్గొననున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే పవన్ ఓజీ సినిమా విషయంలో ఫ్యాన్స్ ఒకింత టెన్షన్ పడుతున్నారు.

పవన్ ఓజీ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన అప్ డేట్స్ ద్వారా ముంబై బ్యాక్ డ్రాప్ లో పవన్ గ్యాంగ్ స్టర్, డాన్ తరహా పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. గతంలో పవన్ బాలు, పంజా సినిమాలలో ఈ తరహా పాత్రలలో నటించి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. బాలు, పంజా సినిమాలు పవన్ అభిమానులను మెప్పించినా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చలేదు.

ఓజీ సినిమాకు ఆ రెండు ఫ్లాప్ సినిమాల కనెక్షన్ ఉండటం ఫ్యాన్స్ ను ఒకింత టెన్షన్ పెడుతోంది. మరోవైపు సుజీత్ గత సినిమా సాహో బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. సాహో మూవీ బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించినా టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం నచ్చలేదు. పవన్, సాహో గత సినిమాల నెగిటివ్ సెంటిమెంట్లకు బ్రేక్ వేసి ఓజీ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో ఓజీ సినిమాపైనే అత్యంత భారీ స్థాయిలో అంచనాలకు ఏర్పడగా సుజీత్ కెరీర్ ను ఈ సినిమా డిసైడ్ చేయనుంది. పవన్ కెరీర్ లో ఓజీ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఓజీ సినిమా నాన్ థియేట్రికల్, థియేట్రికల్ హక్కులకు భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. 2024 సెకండాఫ్ లో ఓజీ సినిమా రిలీజ్ కానుందని భోగట్టా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news