తమన్నా భాటియా..తెలుగులో శ్రీ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో మంచు మనోజ్ హీరోగా నటించాడు. తమన్నా మొదటి సినిమా తెలుగులో డిజాస్టర్ అయింది. దాంతో ఇక తమన్నాకి తెలుగులో ఛాన్స్ రాదనుకుంది. కానీ, అనూహ్యంగా దర్శకుడు శేఖర్ కమ్ముల డాలర్ డ్రీంస్, ఆనంద్ తర్వాత అందరూ కొత్తవాళ్ళని పెట్టి హ్యాపీడేస్ తీస్తూ హీరోయిన్ కోసం చూస్తున్నారు.
ఆ సమయంలో శేఖర్ కమ్ములకి తమన్నా గురించి మేనేజర్స్ చెప్పారు. దాంతో ఆయన తమన్నా నటించిన శ్రీ సినిమాను చూశాడు. సినిమా ఫ్లాపైనా అందులో తమన్నా పర్ఫార్మెన్స్ ఆయనకి బాగా నచ్చింది. వరుణ్ సందేశ్ పక్కన హీరోయిన్‌గా పర్ఫెక్ట్ అని ఫిక్సైయ్యాడు. దాంతో ఆయన టీం తో తమన్నాని పిలిపించి హ్యాపీడేస్ కథ చెప్పాడు.
కథ మొత్తం విన్న తమన్నా ఎగిరి గంతేసేంది. ఇలాంటి సినిమా ఆఫర్ అంటే అస్సలు వదులుకోకూడదనుకుంది. పైగా హ్యాపీడేస్ సినిమా కోసం నెల రోజులు ఆయన ఆఫీసులోనే ఉండాలి అన్నారు. అన్నిటికీ ఒప్పుకున్న తమన్నా ఒక సీన్ లో చిరిగిన జాకెట్ వేసుకొని చంకల కింద చూపించాలంటే మాత్రం నో అన్నట్టుగా చెప్పిందట.
కానీ, శేఖర్ కమ్ముల కథలో ఆ సీన్ చాలా ఇంపార్టెంట్ అని మరీ వల్గర్ గా చూపించనని సీన్ షూట్ అయ్యాక చూసుకో ఒకవేళ నీకు ఇబ్బందిగా అనిపిస్తే మార్చేద్దాం లేదంటే ఆ సీన్ తీసేద్దాం..కానీ, ఆ సీన్ మాత్రం చేయాల్సిందే. అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారట. ఇంత కన్విన్స్ చేసిన తర్వాత ఏ హీరోయిన్ అయినా నో అంటుందా..అది కూడా తమన్నా లాంటి అప్‌కమింగ్ హీరోయిన్. ఓకే అనింది. ఆ తర్వాత సినిమాలో ఆ సీన్ బాగా వచ్చిందని హ్యాపీగా ఫీలైందట.