Moviesవామ్మో నీకో దండం సామి వ‌దిలేయ్‌... ప‌వ‌న్ క‌ళ్యాణ్ - మెహ‌ర్...

వామ్మో నీకో దండం సామి వ‌దిలేయ్‌… ప‌వ‌న్ క‌ళ్యాణ్ – మెహ‌ర్ ర‌మేష్ సినిమా…!

టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ పేరు చెబితేనే సీనియర్ హీరోలు, స్టార్ హీరోల నుంచి చివరకు ఆప్ క‌మింగ్ హీరోల వరకు అందరూ పారిపోయే పరిస్థితి. మెహర్ రమేష్ తెలుగులో చేసిన అన్ని సినిమాలు ఒకదానిని మించి మరొకటి డిజాస్టర్ అయ్యాయి. ఒక్క ప్రభాస్‌తో చేసిన రీమేక్‌ సినిమా బిల్లా మాత్రం యావరేజ్ అయింది. ఎన్టీఆర్ తో చేసిన కంత్రి, శక్తి ఒకదానిని మించి మరొకటి డిజాస్టర్ అయ్యాయి. చివరగా 2013లో విక్టరీ వెంకటేష్ తో షాడో సినిమా తీస్తే అది అతిపెద్ద డిజాస్టర్.

మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఈ ఎడాది మెగాస్టార్ చిరంజీవితో భోళాశంకర్ లాంటి అతిపెద్ద ఎపిక్ డిజాస్టర్ సినిమా మెహర్ రమేష్ తెరకెక్కించాడు. 10 ఏళ్లపాటు ఖాళీగా ఉన్న మెహర్ రమేష్‌కు తమిళంలో ఎప్పుడో ఆరు నెలల క్రితం వచ్చిన వేదాళం సినిమా రీమేక్‌ బాధ్యతలు చిరంజీవి అప్పగించారు. అప్పుడే చాలామంది అసలు చిరంజీవి ఎందుకు ఛాన్స్ ఇచ్చాడు రా బాబు.. అని బుర్రలు బద్దలు కొట్టుకున్నారు. అందరి అంచనాలు నిజం చేస్తూ.. మెహర్ రమేష్ భోళాశంకర్‌ను చిరంజీవి కేరీర్‌లో డిజాస్టర్ సినిమాగా చెత్త రికార్డుల్లో నిలిపారు.

భోళాశంకర్‌ సినిమా రిజల్ట్ చూశాక టాలీవుడ్ జనాలు మెహర్ రమేష్ అంటేనే అస్సలు దగ్గరకు రానివ్వడం లేదు. ఇలాంటి టైంలో మెహర్ రమేష్ చేసిన కామెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులను మాత్రమే కాదు.. తెలుగు సినీ జనాలను కూడా భయపెట్టేస్తోంది. మెహర్ రమేష్ తన తాజా ఇంటర్వ్యూలో తాను ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ సినిమాకు దర్శకత్వం వహిస్తాను అని చెప్పారు.

పవన్ కోసం స్క్రిప్ట్ కూడా రెడీ అయిందని చెప్పడంతో.. బాబు నీకో దండం స్వామి.. అసలే పవన్ కళ్యాణ్ సినిమాలు అంతంత మాత్రమే ఉంటున్నాయి. పైగా అన్ని రీమేక్‌ సినిమాలు చేస్తున్నాడు. ఈ టైంలో నీతో సినిమా అంటే కచ్చితంగా భోళాశంకర్‌ను మించిన మరో అతిపెద్ద డిజాస్టర్ ఖాయం. దయచేసి పవన్.. నువ్వు మెహర్ రమేష్ ని దగ్గరకు కూడా రానివ్వద్దు అంటూ.. పవన్ అభిమానులు, తెలుగు సినీ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news