Newsమహేశ్ కి రష్మిక అంటే ఎందుకు అంత ఇష్టమో తెలుసా..? ఏ...

మహేశ్ కి రష్మిక అంటే ఎందుకు అంత ఇష్టమో తెలుసా..? ఏ హీరోయిన్ కి ఇవ్వని అది ఆమెకు మాత్రమే..!!

జనరల్ గా మహేష్ బాబు హీరోయిన్స్ విషయంలో చాలా దూరంగా ఉంటాడు. తనపై ఎటువంటి రూమర్స్ క్రియేట్ అయ్యే విధంగా నడుచుకోడు . సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్న ఇప్పటివరకు ఆయనకు వేరే హీరోయిన్ తో అఫైర్ ఉంది అంటూ ఒక్కటంటే ఒక్క వార్త రాకపోవడానికి కారణం కూడా అదే . ఆయన హీరోయిన్స్ పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు . ఎప్పుడు హద్దులు మీరరు. షూటింగ్ పూర్తయిందా..? ప్యాకప్ చెప్పి వెళ్ళిపోతారు.

అయితే రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు రష్మిక మందన్నాను హగ్ చేసుకున్న పిక్చర్ వైరల్ అవుతుంది . జనరల్గా స్టేజిపై ఎప్పుడూ కూడా మహేష్ బాబు ఈ రేంజ్ ఏ హీరోయిన్ కి హగ్ ఇవ్వలేదు . కానీ రష్మికను మాత్రం గట్టిగా దగ్గరికి లాగి మరీ వాటేసుకున్నారు . ఇది చాలా ఫ్రెండ్లీగా హెల్దీగానే జరిగిన హగ్. అయితే కొందరు మాత్రం కావాలనే ట్రోల్ చేస్తున్నారు . అయితే రష్మిక మందన్నా అంటే మహేష్ బాబుకు ఎందుకు అంత ఇష్టం అనే వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి .

జనరల్ గా రష్మిక మందన్నా చాలా జోబియల్ గా అందరు హీరోలతో కలుపుగోలుతనంగా ఉంటుంది . కానీ మహేష్ బాబు హీరోయిన్స్ విషయంలో దూరంగా ఉంటారని తెలిసి ..ఆయనకు నచ్చిన పద్ధతిలోనే సరిలేరు నీకెవ్వరు సినిమా షూట్ టైంలో నడుచుకునింది . అంతేకాదు అక్కడికి వచ్చిన నమ్రత – సితారాలు సైతం రష్మిక మందన్నా బిహేవియర్ కు ఫిదా అయిపోయారు. ఇంటిళ్లపాది ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు . ఈ క్రమంలోనే రష్మిక బిహేవియర్ కు మహేష్ బాబు సైతం ఫ్లాట్ అయిపోయాడు . అందుకే రష్మిక అంటే చాలా చాలా ఇష్టం అని అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు . అయితే ఇది చాలా ఫ్రెండ్లీ హగ్ అని.. ఈ విషయం ఇక్కడితో వదిలేయడమే మంచిది అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news