ఒకదశలో అన్నీ ప్రేమ కథలే వచ్చి ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్ఠించాయి. ఖుషి, చిత్రం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, నువ్వు నేను, మనసంతా నువ్వే..ఇలా అన్నీ ప్రేమ కథలే వచ్చి ఇండస్ట్రీ కాసుల వర్షం తో కళకళలాడింది. వెంకటేశ్ లాంటి సీనియర్ హీరో కూడా లవ్ స్టోరీనే చేశారు. పవన్ కళ్యాణ్ ఖుషి ఎలాంటి సునామీని సృష్ఠించో అందరికీ తెలిసిందే.
ఇక ఇండస్ట్రీలో దర్శకుడు తేజది ఓ కొత్త ఒరవడి. చిత్రం సినిమా చూసి ఇలాంటి సినిమాలు కూడా తీసి మెప్పించవచ్చా..ఊహించని వసూళ్ళు రాబట్టవచ్చా..అని అందరు మాట్లాడుకునేలా చేశారు. అయితే, ఆయన పరిచయం చేసిన రీమాసేన్, అనిత, అలాగే నువ్వే కావాలి సినిమాతో పరిచయమైన రీచా లాంటి వారికి నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆర్తీ అగర్వాల్ గట్టి దెబ్బకొట్టింది. పెద్ద బ్యానర్ పెద్ద హీరో పెద్ద దర్శకుడు సినిమాతో పరిచయం అయిన ఆర్తీకి ఇండస్ట్రీ బాగా సపోర్ట్ చేసింది.
కానీ, రీమాసేన్, అనిత, రీచా లాంటి వారికి మాత్రం అంతగా సపోర్ట్ చేయలేదు. ఎన్నో లెక్కలుంటాయి ఒక హీరోయిన్ ని మోయడానికి. ఆర్తీకి అలా వెనకాల చాలామంది ఉన్నారు. నిర్మాత సురేశ్ బాబు ముఖ్యంగా ఆర్తీని బాగా చూసుకున్నారు. ఆయన సంస్థలోనే నువ్వులేక నేను లేను, సోగ్గాడు సినిమాలు ఇచ్చారు. దాంతో వనెకటేశ్, చిరంజీవి, నాగార్జున లాంటి వారు ఆర్తీకి ఛాన్సులిచ్చారు.
ఆ సమయంలో అందరికీ ఆర్తీ అగర్వాల్ కనిపించింది తప్ప రీమాసేన్, అనిత లాంటి వారు కనిపించలేదు. కాస్త అటు ఇటుగా ఇండస్ట్రీకి పరిచయమైన కూడా అందరినీ తొక్కిపెట్టింది ఆర్తీ అగర్వాల్. ఇక అదృష్టం కొద్దీ ఆర్తీ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలుగా నమోదయయ్యాయి. అదొక ప్లస్ పాయింట్. చెప్పాలంటే ఆర్తీ తెలివి తేటలకి అప్పట్లో సెటిలవ్వాల్సిన చాలామంది హీరోయిన్స్ అడ్రస్ లేకుండా పోయారు.