Newsవెంకటేష్-కాజల్ కాంబోలో మిస్ అయిన పరమ చెత్త సినిమా ఇదే..ఆ ప్లేస్...

వెంకటేష్-కాజల్ కాంబోలో మిస్ అయిన పరమ చెత్త సినిమా ఇదే..ఆ ప్లేస్ లో బలైపోయిన బ్యూటీ ఎవరంటే..?

టాలీవుడ్ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈమె ఎన్నో పాత్రలలో నటించి మరింత క్రేజీ అందుకుంది. వివాహమై ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా కాజల్ అగర్వాల్ ఇటీవల సినిమాల్లోకి రి యంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ను సైతం మొదలుపెట్టింది. తాజాగా హీరో వెంకటేష్ పైన కాజల్ అగర్వాల్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసినట్టుగా తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం.

తెలుగు ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరి నటిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను భారీగానే సంపాదించుకున్నారు.. ఇదంతా పక్కన పెడితే వెంకటేష్ తో సినిమా చేయడానికి ఏ హీరోయిన్ అయినా సరే టక్కును ఓకే చెప్పేస్తూ ఉంటారు. ఎంతోమంది హీరోయిన్లను కూడా స్టార్ హీరోయిన్లను చేసిన ఘనత వెంకటేష్ ది. ముఖ్యంగా కత్రినా కైఫ్ ,దివ్యభారతి,టబు తదితర హీరోయిన్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసి మంచి క్రేజీ ని అందుకున్నారు.

బాలీవుడ్ లో ఈ హీరోయిన్స్ తమ హవా కొనసాగించారు. అయితే హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాత్రం వెంకటేష్ సినిమా చేయడానికి ఇష్టపడలేదట.. పూర్తి వివరాల్లోకి వెళితే వెంకటేష్, నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన వెంకీ మామ సినిమా కామెడీ ఎంటర్టైన్మెంట్ గా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో నాగచైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటించగా వెంకటేష్ కి జోడిగా పాయల్ రాజ్ పుత్ నటించింది.

అయితే ఇందులో ముందుగా పాయల్ పాత్ర కోసం కాజల్ అగర్వాల్ ని సంప్రదించగా ఆమె ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదట. అది వెంకటేష్ తో నటించడం ఇష్టం లేక కాదని నాగచైతన్యకి అత్తగా నటించడం అంటే ఇష్టం లేదని తెలియజేసినట్లు సమాచారం. గతంలో వీరు కాంబినేషన్లో దడ సినిమా కూడా వచ్చి ఫ్లాప్ అయ్యింది .అక్కడ వీరికి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడంతో నాగచైతన్యకు హీరోయిన్గా నటిస్తా తప్ప వదినగా, అత్తగా నటించనని చెప్పేసిందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news