టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో బాలయ్య ఒకరు కాగా తాతమ్మ కల సినిమాతో బాలయ్య సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా నటుడిగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ బాలయ్య కెరీర్ పరంగా సక్సెస్ సాధించారు. బాలయ్య స్టార్ హీరో కావడానికి బ్రాహ్మణి జాతకమే కారణమని ఆమె పుట్టిన తర్వాతే బాలయ్యకు కెరీర్ పరంగా ఎంతో కలిసొచ్చిందని ఇండస్ట్రీలో భావిస్తారు.
డిసెంబర్ 21 1988 సంవత్సరంలో బ్రాహ్మణి జన్మించగా బ్రాహ్మణి పుట్టిన తర్వాత బాలయ్య నటించి విడుదలైన భలే దొంగ హిట్ గా నిలిస్తే ముద్దుల మావయ్య ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బాల గోపాలుడు సినిమాతో యావరేజ్ హిట్ ను ఖాతాలో వేసుకున్న బాలయ్య నారీ నారీ నడుమ మురారి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమాల విజయాల వల్లే బాలయ్యకు అప్పట్లో ఊహించని స్థాయిలో స్టార్ డమ్ వచ్చింది.
ఆ సమయంలో బాలయ్య నటించిన కొన్ని సినిమాలు ఫ్లాపైనా ఆ సినిమాలు బాలయ్య కెరీర్ పై పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. తర్వాత రోజుల్లో బాలయ్య లారీ డ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్ స్పెక్టర్ సినిమాలతో తన రేంజ్ ను పెంచుకున్నారు. బ్రాహ్మణి జాతకం నిజంగా మంచి జాతకం అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఆమె వ్యాపార రంగంలో సైతం సంచలన విజయాలను సొంతం చేసుకున్నారు.
ప్రస్తుతం కుటుంబానికి పూర్తిస్థాయిలో సమయాన్ని కేటాయిస్తున్న బ్రాహ్మణి పాలిటిక్స్ లోకి మాత్రం వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ కెరీర్ విషయానికి వస్తే భగవంత్ కేసరి సక్సెస్ ఇచ్చిన జోష్ తో బాలయ్య ప్రస్తుతం మరింత ఉత్సాహంతో బాబీ మూవీ షూట్ లో పాల్గొంటున్నారు. వరుస విజయాల వల్ల ఈ సినిమా బడ్జెట్ లెక్కలు సైతం పెరిగాయని తెలుస్తోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బాలయ్య గత మూడు సినిమాలు కోటి రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి.