మన టాలీవుడ్ లో సొంత నిర్మాణ సంస్థలలో నటిస్తూ సంస్థ ఖ్యాతిని పెంచుతున్న హీరోలు కొందరుంటే కొత్తగా నిర్మాణ సంస్థను స్థాపించి చేతులు కాల్చుకుంటున్న వారూ ఉన్నారు. గీతా ఆర్ట్స్, సురేశ్ ప్రొడక్షన్స్, అన్నపూర్ణ స్టూడియోస్, అంజనా ప్రొడక్షన్స్, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ..ఇవన్నీ ఎప్పటి నుంచే ఉన్న సంస్థలు. ఈ సంస్థలలో భారీ హిట్స్ ఉన్నాయి. డిజాస్టర్స్ కూడా ఉన్నాయి.
కొన్ని సంస్థలు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తూ కొంత వరకూ బయటపడుతున్నాయి. అయితే, ఆ తర్వాత వచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ పాతుకుపోయిన దిల్ రాజు సంస్థకి గట్టిగానే పోటీ ఇస్తుంది. ఇప్పుడు ఈ రెండు సంస్థల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలలో టాక్ ఉంది. అయినా ఎవరికి వారు పెద్ద హీరోలతో పాటు చిన్న హీరోలతోనూ సినిమాలు చేస్తూ వస్తున్నారు.
వీరి సంగతి పక్కన పెడితే, నాని..నితిన్..నాగ శౌర్య లాంటి వారు కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి టాలెంటెడ్ డైరెక్టర్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ, ఈ యంగ్ హీరోలు చేస్తున్న వాటిలో ఎక్కువ శాతం ఫ్లాపులే ఉంటున్నాయి. ఇటీవల కాలంలో నితిన్, నాగ శౌర్య సంస్థలలో వారే హీరోలుగా నటించిన సినిమాలు దారుణంగా ఫ్లాపయ్యాయి. దాంతో ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థలు బాగా నష్టాలలో ఉన్నాయని చెప్పుకుంటున్నారు.
నాని సొంత నిర్మాణ సంస్థ కూడా నష్టాలలో ఉందట. నాని టాలెంటెడ్ డైరెక్టర్స్ ని ఎంకరేజ్ చేస్తున్నాడు గానీ, కథ విషయంలో కరెక్ట్ గా జడ్జ్ చేసుకోలేకపోతున్నాడు. దాంతో నానీ కి కూడా బాగానే నష్టాలు వస్తున్నాయని…తను హీరోగా చేస్తూ వచ్చిన రెమ్యునరేషన్ తో అప్పులు తీర్చుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. మరి వీళ్లకెందుకు సొంత నిర్మాణ సంస్థలు. కుదురుగా హీరో వేశాలు వేసుకోక.