తాజాగా నటి త్రిష విషయంలో వెలుగు చూసిన మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యల నేపథ్యంలో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తాజా చిత్రం లియో
లో త్రిషతో రేప్ సీన్ లేకపోవడం.. తనను బాధించిందని.. ఉండి ఉంటే వేరేగా ఉండేదని.. మన్సూర్ అలీఖాన్ తీవ్ర అభ్యంతర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. దీనిని మెజారిటీ హీరోలు, హీరోయిన్లు ఖండించారు. అదేసమయంలో అలీఖాన్‌ను సమర్థించిన వారు కూడా ఉన్నారు.
ఇవన్నీ మామూలే.. అంటూ.. కోలీవుడ్‌కు చెందిన కొందరు యాక్టర్లు అలీఖాన్‌ను సపోర్టు చేశారు. దీంతో ఇతర ఇండస్ట్రీలకంటే కూడా.. కోలీవుడ్‌లోనే క్యాస్టింగ్ కౌచ్ (లోబరుచుకోవడం) ఎక్కువగా ఉందా? అనే చర్చ తెరమీదికి వచ్చింది. సహజంగానే సినీ రంగంలో అవకాశాల కోసం.. అనేక సమస్యలు ఎదుర్కొన్నవా రు ఉన్నారు. ఈక్రమంలో తమను తాము రాజీ చేసుకున్న వారు కూడా ఉన్నారు. అయితే.. ఇవన్నీ గోప్యంగానే ఉండేవి. కానీ, తెలుగు ఇండస్ట్రీలో శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యల తర్వాత.. ఈ విషయం మరింత హాట్ టాపిక్‌గా మారింది.
ఇక, ఇటీవల తమిళనాడుకు చెందిన ఓల్డ్ హీరోయిన్ కూడా.. 2021లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెరమీదికి తెచ్చారు. అప్పట్లో తెలుగు అగ్రనటుడితో తాను ఇబ్బంది పడ్డానని.. వేయరాని చోట, చెప్పుకో లేని చోట ఆయన చేతులు వేశారని.. రూమ్‌కు కూడా రమ్మన్నారని.. ఆమె ఓ రియాల్టీ షోలో వెల్లడించారు. అంతేకాదు.. ఈ విషయం డైరెక్టర్, ప్రొడ్యూసర్లకు చెబితే.. తనను కొట్టారని కూడా చెప్పుకొచ్చారు. ఇక, కొసమెరుపు ఏంటంటే.. ఇండస్ట్రీలో ఇవన్నీ కామనేనని ఆమె వెల్లడించారు.
మొత్తంగా చూస్తే.. తమిళ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది కామన్‌గా జరిగిపోతున్న అంశంగానే బయట ప్రచారం జరుగుతోంది. తెలుగు, కన్నడ.. ఇండస్ట్రీల కంటే కూడా.. దక్షిణాదిలో తమిళ ఇండస్ట్రీలోనే క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందనే విషయాన్ని అనేక మంది సమర్థిస్తుండడం కూడా.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.