సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ ఒక్కొక్క హీరో ప్రతి సినిమాకి 70 నుంచి 100 కోట్ల రెమ్యూనిరేషన్ పైనే ఛార్జ్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే కొందరికి హీరోలు రెమ్మినరేషన్ తో పాటు యాడ్స్ ప్రమోట్ చేస్తూ కోట్లల్లో సంపాదిస్తున్నారు . అయితే ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరో ఎవరు ..? ఏ హీరోకి ఎక్కువ ఆస్తి ఉంది..? ఏ హీరో ఎక్కువ పారితోషకం తీసుకుంటూ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.
సౌత్ ఇండియాలో అనేక మంది హీరోలు ఉన్న భారీ సంఖ్యలో పారితోషకాలు తీసుకుంటూ ఉన్న సౌత్ లో మాత్రం రిచెస్ట్ యాక్టర్ అనగానే ఒక పేరు వినిపిస్తుంది . ఆయన ఎవరో ఇప్పుడు మనం ఇక్కడ చదివి తెలుసుకుందాం ..!!
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యంత ధనవంతుడు ఎవరు అంటే అక్కినేని నాగార్జున అంటూ వినిపిస్తుంది. ప్రముఖ మెన్స్ ఫ్యాషన్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం అక్కినేని నాగార్జున టోటల్ ఆస్తి విలువ 3270 కోట్లుగా తెలుస్తుంది . సౌత్ ఇండియాలో భారీ సినిమాలు చేస్తున్న అగ్ర హీరోలు చిరంజీవి – బాలకృష్ణ – కమల్ హాసన్ – వెంకటేష్ – విజయ్ – రామ్ చరణ్ – పవన్ కళ్యాణ్ – ప్రభాస్ ఇలా అందరికన్నా కూడా అక్కినేని నాగార్జున ఆస్తి ఎక్కువ అంటూ తెలుస్తుంది .
జైలర్ సినిమాకి రజనీకాంత్ 110 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం . ఆయన ఆస్తి 430 కోట్లు ఉంటుంది అంటూ అంచనా. లియా సినిమా కోసం విజయ్ తళపతి 130 కోట్లు తీసుకుంటే ఇండియన్ 2 కోసం కమలహాసన్ 150 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఒక్కొక్క సినిమాకి 150 కోట్లు తీసుకుంటున్నాడు . అయితే ఇలా ఎంతమంది స్టార్స్ వందల కోట్లు తీసుకుంటున్నా కానీ నాగార్జున మాత్రం తన సినిమాలకి తీసుకునే రెమ్యూనరేషన్ కేవలం 45 – 50 కోట్లు మాత్రమే . అయినా ఆయన ఆస్తి 3000 కోట్లు దాటింది అంటే దానికి కారణం ఆయనకున్న బిజినెస్ లు అంటూ తెలుస్తుంది..!!