కొందరు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాము అంటుంటారు. చెప్పాలంటే ఈ మాట చాలామంది హీరోలు, హీరోయిన్స్ చెప్పే మాటే. ఇప్పుడున్న క్రేజీ హీరోయిన్స్ లో సాయి పల్లవి కూడా మెడిసిన్ చేసింది. డాక్టర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టాలనుకున్న సమయంలో ప్రేమం సినిమా ఛాన్స్ వచ్చింది. దాంతో దాంతో డాక్టర్ వృత్తిని పక్కన పెట్టి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతోంది.
అలాగే మన తెలుగు ఇండస్ట్రీలో కూడా కొందరు హీరోలు ఏపని చేతకాక ఇండస్ట్రీలో హీరోగానో టెక్నీషియన్ గానో సక్సెస్ అవుతున్నారు. ఇలా కొందరు హీరోయిన్స్ మోడలింగ్ నుంచి హీరోయిన్ అయి సక్సెస్ అయినవాళ్ళూ ఉన్నారు. బాలీవుడ్ లో దీపిక పడుకునే, కంగనా రనౌత్ లాంటి వారు ముంబైలో హీరోయిన్ అవకాశాల కొసం వచ్చి కెరీర్ బిగినింగ్ లో రోడ్ల మీద ఉన్న క్షణాలు ఉన్నాయి.
అదే విధంగా మాలాశ్రీ కూడా అర్థాంతరంగా తల్లి చనిపోవడంతో కుటుంబ పోషణకై సినిమా ఇండస్ట్రీకి వచ్చి మొహానికి మేకప్ వేసుకుంది. తెలుగులో రామాయుడు సెలెక్ట్ చేస్తే ప్రేమఖైదీ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కొంతకాలం హాట్ హీరోయిన్గా సందడి చేసింది. వాస్తవానికి మాలాశ్రీ హీరోయిన్ అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. వాళ్ళ అమ్మగారు చనిపోవడంతో కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత తనమీద పడింది.
దాంతో అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న తన స్నేహితుడు సునీల్ సహాయంతో తమిళంలో నటించే అవకాశం అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలతో ఊపు ఊపేసింది. ప్రేమఖైదీ, బావ బావమరిది సినిమాల గురించి మాట్లాడుకుంటే ముందు గుర్తొచ్చేది మాలాశ్రీనే. అలా తెలుగులో 30కి పైగా సినిమాలు చేసింది. తమిళంతో సహా కన్నడలోనూ నటించింది. ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది.
ఎవరైతే తనని ఇండస్ట్రీకి పరిచయం చేశారో అతనితో ప్రేమలో ఉన్నప్పుడు కారు యాక్సిడెంట్ అవల్ల అతను చనిపోయాడు. ఆ తర్వాత ఇంకో నిర్మాతని పెళ్ళి చేసుకొని సెటిలైంది. ఆయన పేరు రాము. అయితే రాము కన్నడంలో ఫేమస్ డిస్ట్రిబ్యూటర్. అతను కూడా కరోనా సెకండ్ వేవ్‌లో కరోనాతో మృతి చెందారు.