శంకరాభరణం సినిమాలో చంద్రమోహన్ విజృంభించి నటించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన కాశీనాథుని విశ్వనాథ్.. తొలుత శోభన్‌బాబును ఈ పాత్రకు ఎంపిక చేశారు. అయితే.. ఆయన అప్పటికే స్టార్ డమ్‌తో ఉండడంతో సెకండ్ హాఫ్ వరకు హీరో ఎంట్రీలేని సినిమాలో తాను నటించేదిలేదన్నారు. దీంతో తన సోదరుడు అయిన చంద్రమోహన్‌ను విశ్వనాథ్ ఒప్పించారు. ఇక, అప్పటికే చంద్రమోహన్ బిజీగా ఉన్నప్పటికీ.. అన్నయ్య అడిగిన సినిమాలో చేయాల్సిందేనని పట్టుబట్టి మరీ ఈ సినిమా చేశారు. ఈ సినిమా హిట్ అయింది. తర్వాత అనేక అవకాశాలు వచ్చాయి.
అయితే.. ఈ సినిమాను ఎక్కువగా అన్నవరం, తూర్పుగోదావరిలోని రాజమండ్రి పరిసరాల్లో చిత్రీకరించారు. షెడ్యూల్ అంతా అక్కడే సాగింది. దీంతో చెన్నై నుంచి చంద్రమోహన్ వచ్చేసి సుమారు నెల రోజులు అక్కడేఉన్నారు. ఈ సినిమాలో శంకర శాస్త్రి కుమార్తెను చంద్రమోహన్ ప్రేమిస్తాడు. కథపరంగా ఇద్దరూ హిట్టయ్యారు. అయితే.. తర్వాత కాలంలోనూ ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించడం.. వివాదానికి దారితీసింది. అప్పటికే చంద్రమోహన్‌కు ఒక కుమార్తె ఉంది. అయినా..తరచుగా వీరి మధ్య మాటలు సాగడం, ప్రేమకు దారితీయడం.. వంటివి ఇండస్ట్రీలో వివాదం సృష్టించింది.
చంద్రమోహన్ వివాహం చేసుకున్న ఆవిడ కూడా.. విశ్వనాథ్‌కు దగ్గర బంధువు. దీంతో శంకరాభరణం హీరోయిన్‌తో చంద్రమోహ న్ ప్రేమ వ్యవహారం ఆయన వరకు చేరింది. దీంతో ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. చంద్రమోహన్ ఒప్పుకొన్నా.. అటు వైపు నుంచి ఆమె మాత్రం విశ్వనాథ్‌ను పక్కన పెట్టారు. ఇది చిలికిచిలికి గాలివానగా మారింది. ఇండస్ట్రీలోనూ టాక్ పెరిగిపోయింది. దీంతో విశ్వనాథ్ చంద్రమోహన్‌కు షరతు పెట్టారట. నువ్వే ఆ అమ్మాయిని ఒప్పించి.. మీ ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఆదేశించారట. అసలే అన్నయ్య.. పైగా ఇండస్ట్రీలో విశ్వనాథ్ హవా నడుస్తోంది. దీంతో ఆయన మాట తీసేయలేక.. తనే ఒప్పించి.. ఆమెకు వేరే వివాహం చేయించాడట.
ఈ విషయాన్ని కూడా చంద్రమోహన్ స్వయంగా చెప్పడం గమనార్హం. ఇది నా జీవితంలో పెద్ద మలుపు. అసలు ఏమైపోతుందో అనుకున్న సమయంలో అనూహ్యంగా అన్నయ్య ఎంట్రీ ఇచ్చారు. అటు వైపు భార్య, కుమార్తె, ఇటు వైపు ఈ అమ్మాయి. ఏం చేయాలో తెలియలేదు. నా తప్పే ఎక్కువగా ఉందని అంగీకరించా. పెద్దలు ఏం చెబితే అదే చేయాలని అనుకున్నా.. అందుకే కష్టమో .. ఇష్టమో.. తనను ఒప్పించి వివాహం చేశా. ఇప్పటికీ మా ఇంటికి వాళ్లు వస్తూనే ఉంటారు
అని చంద్రమోహన్ వివరించారు.