Moviesఒక్క గంటకి అన్ని లక్షలా..? కాజల్ ని భరించలేం రా బాబోయ్.....

ఒక్క గంటకి అన్ని లక్షలా..? కాజల్ ని భరించలేం రా బాబోయ్.. శ్రీలీలనే బెటర్..!

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న సామెతను బాగా ఫాలో అవుతూ ఉంటారు సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్లు . అయితే ప్రతి ఒక్క హీరోయిన్ డబ్బుకోసమే సినిమాలు చేస్తుందా..? అంటే నో అనే చెప్పాలి . కొందరు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఆత్మ అభిమానం కోసం కూడా సినిమాలు చేస్తూ ఉంటారు . మరి కొంతమంది మాత్రం కేవలం డబ్బు కోసమే సినిమాలో నటిస్తూ ఉంటారు .

అయితే రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది కాజల్ అగర్వాల్ అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కాజల్ అగర్వాల్ ప్రెసెంట్ రేంజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్ గా భగవంత్ కేసరితో హిట్టు అందుకున్న కాజల్ ను ఓ ప్రముఖ సంస్ధ కరపత్రం లాంచ్ ఈవెంట్ కు హాజరవ్వమని కోరగా ఏకంగా ఆమె 50 లక్షలు డిమాండ్ చేసిందట .

నిజానికి ఇది చాలా చాలా ఎక్కువ.. కాజల్ కి అంత ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు . అయితే మేకర్స్ ఆమె దెబ్బకు భయపడిపోయి ఆమె ప్లేస్ లోకి శ్రీ లీలను తీసుకువచ్చారట . శ్రీ లీల కేవలం 12 లక్షలే చార్జ్ చేసిందట . అంతేకాదు ట్రావెలింగ్ ఖర్చులు కూడా తీసుకోలేదట . అదే కాజల్ కి ఫ్లైట్ ఖర్చులతో పాటు రూమ్ స్టేయింగ్ ఖర్చులు కూడా ఇవ్వాల్సి వచ్చేది . ఇలా కాజల్ రేటు ని భరించలేక సదరు సంస్ధ శ్రీలీలను ఫైనలైజ్ చేసుకుంది అన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news