ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా వాళ్ళు సోషల్ మీడియాకి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సరే వాళ్ల గురించి పలు రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి . టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కావడంతో జనాలు కూడా వాళ్ల గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే బాలయ్య రెండో కూతురు తేజస్విని పెళ్లి కి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది.
నందమూరి నటసింహం బాలయ్యకు ఇద్దరు కూతుర్లు.. ఒక కొడుకు. పెద్ద కూతురు బ్రాహ్మిణిని నారా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కి ఇచ్చి పెళ్లి చేశారు. రెండో కుమార్తె తేజస్విని భరత్ కి ఇచ్చి పెళ్లి చేశారు. కొడుకు మోక్షజ్ఞ త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇలాంటి క్రమంలోనే నందమూరి బాలయ్య రెండో కూతురు తేజస్వినికి స్టార్ హీరో సంబంధం వచ్చినా కానీ బాలయ్య ఆ పెళ్లి చేయలేదు అన్న వార్త వైరల్ అవుతుంది.
మొదటి నుంచి పద్ధతి కట్టుబాట్లు ఎక్కువగా చూసే బాలయ్య తన కూతురు విషయంలో ఇంకా ఇంకా జాగ్రత్తలు వహించారు. అంతేకాదు బాలయ్య పై ఉండే
గౌరవంతో ఇష్టంతో స్టార్ హీరో తన కొడుకును బాలయ్య రెండో కూతురు తేజస్వినికి ఇచ్చి పెళ్లి చేయాలి అని చాలా ట్రై చేశారట. అయితే అతగాడి బిహేవియర్ తెలిసిన బాలయ్య తన కూతుర్ని ఆ హీరోకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడలేదు . అంతేకాదు ఇప్పుడు ఆ హీరో వేరొక హీరోయిన్ ని పెళ్లి చేసుకొని విడాకులు కూడా ఇచ్చేశాడు. ఇలాంటి బిహేవియర్ ముందే గెస్ చేసిన బాలయ్య తేజస్విని లైఫ్ బాగుండాలి అని మంచి అబ్బాయి అయినా భరత్ కి ఇచ్చి పెళ్లి చేశాడు . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది