టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత మూడు, నాలుగు ఏళ్ళుగా సరైన బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా అంటూ హడావుడి చేసినా లైగర్ డిజాస్టర్ అవడంతో పాటు విజయ్ పరువు ఘోరంగా తీసేసింది. ఖుషితో ఏమన్నా పని జరుగుతుంది అనుకుంటే అది కూడా నిరాశనే మిగిల్చింది ఖుషి. నిజం చెప్పాలంటే సమంత లాంటి హీరోయిన్, విజయ్ లాంటి కుర్ర క్రేజీ హీరో ఉన్నా కూడా ఆ రేంజ్ కు తగిన హిట్ కాలేదు.
అసలు విజయ్‌కు అంత సూటబుల్ సినిమా కూడా కాలేదు. ఇక ఇప్పుడు పరశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నాడు. పరశురామ్ మీద కూడా మరి అంత భయంకరమైన నమ్మకాలు అయితే లేవు. గీతగోవిందం లాంటి హిట్ సినిమా మళ్లీ రిపీట్ అవుతుందన్న అంచనాలు లేవు. పైగా సర్కార్ వారి పాట సినిమాతో పరశురాంపై అంచనాలు ఆకాశం నుంచి పాతాళంలో పడ్డాయి. ఫ్యామిలీ స్టార్ సినిమా సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అవుతుందని అనుకున్నారు. ఇప్పుడు సంక్రాంతికి రావటం లేదని క్లారిటీ వచ్చేసింది.
ఇక మిగిలింది మార్చి నెల. మార్చి నెలలో చాలా సినిమాలు పోటీలో ఉన్నాయి. ఈ సినిమా తర్వాత విజయ్ చేయాల్సిన సినిమా గౌతమ్ తిన్ననూరి సినిమా. అతడు ఈ మధ్యలో ఒక చిన్న సినిమా చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ తర్వాత విజయ్ తో సినిమా ఉంటుంది. అంటే 2024 లో విజయ్ దేవరకొండ నుంచి ఫ్యామిలీ స్టార్ సినిమా తప్ప మరో సినిమా అయితే రాదు. ఇక 2025లో విజయ్, గౌతమ్ తిన్ననూరి సినిమా వస్తుంది. అంటే విజయ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అన్ని పాన్ ఇండియా సినిమాలు కాదు. మరి అంత క్రేజ్ ఉన్న సినిమాలో కూడా కాదు.
ఈ లెక్కన చూస్తే విజయ్ మార్కెట్ ఎలా ? పెరుగుతుంది అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం అందరూ పాన్ ఇండియా అంటూ పరుగులు పెడుతున్నారు. విజయ్ కూడా లైగర్‌తో పాన్ ఇండియా అంటూ హడావుడి చేసి చేతులు కాల్చుకున్నా ఇప్పుడు సరైన కథలు, సరైన డైరెక్టర్లను ఎంపిక చేసుకుంటే అతడికి తిరిగుండదని లేకపోతే మరో మూడు, నాలుగు ఏళ్ల పాటు అతని మార్కెట్ పెరిగే స్కోప్ లేదన్న చర్చలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మరి విజయ్ ఇకపై కథలు, దర్శకుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది.