Newsబాలు ఆ న‌టుడితో చెప్పిన చివ‌రి మాటే నిజ‌మైందా.. గుండెలు పిండేసే...

బాలు ఆ న‌టుడితో చెప్పిన చివ‌రి మాటే నిజ‌మైందా.. గుండెలు పిండేసే నిజం..!

గాన గంధర్వుడు, ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ దేశాలను ఆయన పాటతో మైమరపించారు. ఇళయరాజా, ఆశా భోంస్లే, కె జే ఏసుదాస్, కేవీ మహదేవన్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, వేటూరి లాంటి వారితో ఆయన జీవిత ప్రయాణం సాగింది. ఆయన కెరీర్‌లో మరపు రాని మర్చిపోని పాటలెన్నో ఉన్నాయి.

బాలు పేరు చెప్పుకొని సినిమాలు అమ్ముకున్న నిర్మాతలు ఎందరో ఉన్నారు. ఆయన చెల్లి ఎస్పీ శైలజతో ఉన్న అనుబంధం గురించీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇద్దరూ కలిస్తే ఆరోజు పాటల సందడే. కనీసం ఓ 30 పాటలు అలా పాడుకుంటూ వెళతారట. అలా బాలు ప్రతీ నిముషం పాటలతోనే జీవించారు. అయితే, ఆయన అనుకోకుండా హైదరాబాద్ రావడం కరోనా బారిన పడటం తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోవడం అంత ఓ కలలా జరిగిపోయింది.

దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఆయన బావగారైన నటుడు శుభలేఖ సుధాకర్ ప్రేక్షకులతో పంచుకున్నారు. కరోనా వేవ్స్ ముమ్మరంగా ఉన్న సమయంలో శుభలేఖ సుధాకర్ రామోజీ ఫిల్మ్ సిటీలో అమ్మ అనే సీరియల్ చేస్తున్నారు. ఆయన ఉన్నారుగా నాకు ఏమీ కాదు అనే నమ్మకంతో అదే రామోజీ ఫిల్మ్ సిటీలో పాడుతా తీయగా ఫైనల్స్ కి వచ్చారు.

అలా వచ్చినప్పుడు శుభలేఖ సుధాకర్ తో కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత ఆయనతో బాలు చెపిన చివరి మాట రేపు వెళుతున్నాను అని. అదే ఆఖరి మాటైంది. మళ్ళీ బాలూను చనిపోయాకే చూశారట శుభలేఖ సుధాకర్. ఇక్కడ పరిస్థితులు బావున్నాయని నేను చెప్పబడ్డే వచ్చారు. లేదంటే ఆయన ఇంటి నుంచి కదిలేవారు కాదని ఎమోషనల్ అయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news