సాధారణంగా అన్నగారు ఎన్టీఆర్ డబ్బింగ్ సినిమాలకు దూరంగా ఉంటారు. మన నేటివిటీ ఉండాలని పట్టుబట్టేవారు. ప్రతి సిని మాలోనూ తెలుగు దనం కోసం ఆయన పరితపించేవారు. దీంతో డబ్బింగ్ సినిమాల విషయంలో ఒకింత దూరంగానే ఉండేవా రు. ఇదే సూత్రాన్ని అక్కినేని నాగేశ్వరరావు కూడా పాటించేవారు. డబ్బింగ్ కథలన్నా.. సినిమాలన్నా..అక్కినేని కూడా ఇష్టపడేవారు కాదు. మనం ప్రేక్షకులపై ఏదీ రుద్దకూడదు
అని ఇద్దరు అగ్రనటులు కూడా పదే పదే చెప్పేవారు.
కానీ, కొన్ని కొన్సి సందర్భాల్లో ఈ ఇద్దరూ కూడా డబ్బింగ్ సినిమాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి.
విజయ, వాహిని.. వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో అక్కినేని, ఎన్టీఆర్ కలిసి కొన్ని సంవత్సరాలు పనిచేశారు. ఈ పరిచయంతో వారు ఆయా సంస్థలు డబ్బింగ్ కథలు తీసుకువచ్చి సినిమాలు చేయాలని అడిగినప్పుడు కాదనలేక పోయారు. అయితే.. ఇలాంటి సమయాల్లో కొంత మార్పులు చేయాలని మాత్రం అన్నగారు పట్టుబట్టేవారు.
అంతేకాదు.. నేటివిటీకి తగిన విధంగా సినిమా కథను కూడాకొంత మార్చుకునేలా హక్కు దారుల వద్ద పత్రం రాయించుకునేవారు. అప్పట్లో డబ్బింగ్ సినిమాలంటే.. పెద్దగా మార్పులు చేయడానికి సొంత కథల రచయితలు, దర్శకులు ఇష్టపడేవారు. ఇలా.. వచ్చిన సినిమానే రాము. దీనిని విజయావారు తీశారు. ఈ సినిమాలో అన్నగారు ఎన్టీఆర్ నటించారు. అయితే.. ఈయన తెలుగు దనం కోసం ఎంతో కష్టపడ్డారు. రారా కృష్ణయ్య పాటను పట్టుబట్టి రాయించుకుని పెట్టేలా దర్శకుడితో ఒప్పందం చేసుకున్నారు.
అంతేకాదు.. ప్రతి ఫ్రేమ్‌లోనూ సొంత నేటివిటీ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అలానే అక్కినేని నాగేశ్వరరావు నటించిన భక్త తుకారాం సినిమా కూడా మహారాష్ట్ర కథ. దీనిలోనూ సందర్భోచితంగా అనేక మార్పులు చేస్తేనే నటిస్తానని.. అంజలీదేవితో ఒప్పందం చేసుకున్నారట. ఇది అంజలీదేవి సొంత బ్యానర్పై తీసిన కథ కావడం విశేషం. ఎలా చూసుకున్నా.. ఇద్దరు అగ్రనటులు కూడా.. తెలుగుకు ప్రాణం పోయడంలో ఎక్కడా రాజీ పడలేదని తెలుస్తుంది.