టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తిరుగు లేని హీరోగా దూసుకుపోతున్నారు. వరుస సూపర్ డూపర్ హిట్లతో మహేష్ బాబు కెరీర్ పరంగా తిరుగులేని స్టార్‌గా కొనసాగుతున్నారు. గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి మెప్పించిన మహేష్.. ప్రస్తుతం మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మహేష్ బాబు జోడిగా మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే భారీ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు.. సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు 1975 ఆగస్టు 9న మద్రాస్ లో జన్మించారు. మహేష్ బాబు పుట్టిన తర్వాత తండ్రి కృష్ణ 100 సినిమాలకు పైగా పూర్తి చేసి ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు.
మహేష్ 1999లో వైజయంతి మూవీస్.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. అయితే మహేష్ బాల నటుడుగా ఆరేళ్ల వయసులోనే ఒక సినిమాలో నటించాడు. తాను సినిమాలో నటిస్తున్నానన్న విషయం మహేష్ కు కూడా తెలియదు. తన అన్న రమేష్ తో కలిసి విజయవాడ వెళ్లారు. ఆ టైంలో దాసరి దర్శకత్వంలో నీడ అనే సినిమా రమేష్ చేస్తున్నారు. మహేష్ కి తెలియకుండానే ఆయనపై షూటింగ్ చేశారు దాసరి.
అలా బాలనటుడుగా తెరంగేట్రం మహేష్ చేశారు. తర్వాత నాన్న కృష్ణతో పోరాటం సినిమాలో నటించి మెప్పించారు. ఆ తర్వాత బాలనట్టుడుగానే బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూడచారి 117, కొడుకు దిద్దిన కాపురం సినిమాలు చేశాడు. మహేష్ బాలనటుడిగా ఎన్నో సినిమాలలో నటించి తర్వాత వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చి తండ్రి నటవారసత్వాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్ లో సూపర్ స్టార్ అయ్యారు.