టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. టాలీవుడ్ లో చంద్రమోహన్ ది ఐదున్నర దశాబ్దాల ప్రస్థానం. తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాలలో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి మెప్పించారు. చంద్రమోహన్ రంగులరాట్నం సినిమాతో తన సినీ ప్రస్థానం మొదలు పెట్టిన చంద్రమోహన్ హీరోగా 175 సినిమాలు ఓవరాల్గా 932 సినిమాలలో నటించారు.
దీనిని బట్టి ఆయనది టాలీవుడ్ లో ఎంత సుదీర్ఘమైన ప్రస్థానం తెలుస్తోంది. మొత్తం 55 సంవత్సరాల పాటు ఆయన ఇండస్ట్రీలో కొనసాగారు. చంద్రమోహన్ కు వచ్చిన అవార్డులు, రివార్డుల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అయితే చంద్రమోహన్ భార్య జలంధర కూడా ఒక టాప్ సెలబ్రిటీ. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
జలంధర మంచి రచయిత్రి. చంద్రమోహన్ చేతితో ఒక రూపాయి తీసుకుంటే బాగా కలిసి వస్తుందన్న నమ్మకం ఎంతో మందిలో ఉంటుంది. ఇప్పటికీ జనవరి ఫస్ట్ కు మా ఇంటికి ఎంతోమంది వచ్చి ఆయన చేత్తో డబ్బులు తీసుకుంటూ ఉంటారని జలంధర ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన చేత్తో నాకు డబ్బు ఇవ్వటం వల్ల నాకు మంచి స్టార్ రైటర్ గా పేరు వచ్చిందని కూడా తన భర్త గురించి ఆమె ఎంతో గొప్పగా చెప్పుకోచ్చారు.
జలంధర ఈ మాటలు మాట్లాడినప్పుడు పక్కనే ఉన్న చంద్రమోహన్ ఎంతో భావోద్వేగానికి కూడా గురయ్యారు. ఈ భార్యాభర్తల మధ్య అనుబంధం ఎంతో గొప్పగా ఉంటుంది. జలంధర ఎంత మంచి రచయిత్రి అయినా కూడా ఆయన చాలా సింపుల్గా ఉంటారు.