తాజాగా వచ్చిన భగవంత్ కేసరి సినిమాతో నందమూరి బాలకృష్ణ ఎన్నో రికార్డులను తిరగరాశారు. మరీ ముఖ్యంగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా మూడు వరుస సినిమాలతో బాలయ్య మూడుసార్లు వరుసగా 100 కోట్ల క్లబ్లో చేరిన హీరోగాను.. అటు అమెరికాలో వరుసగా మూడుసార్లు వన్ మిలియన్‌కు పైగా డాలర్లు కొల్లగొట్టిన సీనియర్ హీరోగాను రికార్డుల్లోకి ఎక్కారు. సీనియర్ హీరోలు ఇలాంటి రికార్డులు ఎవ్వరికీ లేవు.
పైగా వరుసగా మూడు సూపర్ డూపర్ హిట్ సినిమాలు అంటే మామూలు విషయం కాదు. ఈ మూడు సినిమాలు బాలయ్య కెరీర్‌లోనే మరపురాని సినిమాలుగా నిలిచిపోయాయి. బాలయ్య క్రేజ్ స్కై రేంజ్‌లో ఉందని చెప్పేందుకు ఈ సినిమాలకు వచ్చిన కలెక్షన్లు నిదర్శనం. ఇదిలా ఉంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు సిటీలో బాలయ్యకు టాలీవుడ్ హిస్టరీలోనే ఆల్ టైం రికార్డు ఉంది. టాలీవుడ్ లో ఏ హీరోకి లేని అరుదైన రికార్డు కందుకూరులో బాలయ్య ఖాతాలో ఉంది.
బాలయ్య హ్యట్రిక్ హిట్లు అయిన అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు వరుసగా అక్కడ రూ. 15 లక్షలకు పైగా షేర్ రాబట్టాయి. దీంతోపాటు బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు కూడా కందుకూరు సిటీలో రూ.15 లక్షలకు పైగా షేర్ వచ్చింది. చిన్న మున్సిపాలిటీ అయిన కందుకూరులో రూ.15 లక్షల పైగా షేర్ ఉన్న నాలుగు సినిమాలు తన ఖాతాలో వేసుకున్న ఏకైక హీరోగా బాలయ్య కందుకూరి హిస్టరీలో నిలిచిపోయారు.
అందులోనూ మూడు వరస సినిమాలు రూ.15 లక్షలు పైగా షేర్ కొల్లగొట్టడం.. ఈ రికార్డు కందుకూరులో మరో హీరోకు లేకపోవడం అరుదైన విషయంగా చెప్పాలి. దీనిని బట్టి కందుకూరులో బాలయ్యకు ఎంత బలమైన ఫ్యాన్ బేస్ ఉందో తెలుస్తోంది.