అందుకే మన ఇంట్లోని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు . తొందరపడి ఏ డెసిషన్ తీసుకోకూడదు. ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అని. పేరు ఉంది కదా మన వెనుక జనాలు ఉన్నారు కదా.. అని తొందరపడి ఆవేశంలో ఒక నిర్ణయం తీసుకుంటే దాని తాలూకా పరిణామాలు మనమే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తుంది యంగ్ బ్యూటీ శ్రీ లీల .
ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని దూసుకుపోతుంది . రీసెంట్ గా శ్రీలీల టఫ్ సిచువేషన్ ఫేస్ చేస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి . మనకు తెలిసిందే శ్రీలీల ఫుల్ బిజీ బిజీగా ఉంది . అయితే శ్రీ లీల అనుకోకుండా చూసుకోకుండా ఒకే కాల్ షీట్స్ రెండు సినిమాలకు ఇచ్చేసిందట .
ఇప్పుడు ఇద్దరు కూడా మేము తగ్గము మేము కాంప్రమైజ్ అవ్వము అంటూ పీకల మీదకు వచ్చారు. దీంతో ఏం చేయాలో తెలియక శ్రీలీల దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది . ఇద్దరు కూడా బడా హీరోలు కావడంతో శ్రీ లీల ఏం చేయాలో తెలియని పొజిషన్లో ఉండిపోయిందట . కచ్చితంగా ఒక సినిమాను వదులుకోకు తప్పదు. ఒక సినిమాని పోస్ట్ పోన్ అయినా చేయాలి. మేకర్స్ కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది అంటున్నారు అభిమానులు. దీంతో శ్రీ లీల తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకున్నానని బాధపడిపోతుందట . చూద్దాం శ్రీలల ఏం చేస్తుందో ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడుతుందో..?