Moviesఅందరి హీరోయిన్స్ విషయాలల్లో నోరు మూసుకుని ఉండే నాగచైతన్య.. రష్మిక వీడియో...

అందరి హీరోయిన్స్ విషయాలల్లో నోరు మూసుకుని ఉండే నాగచైతన్య.. రష్మిక వీడియో పై మాత్రమే ఎందుకు బాధపడుతున్నారో తెలుసా..?

వామ్మో.. ఏంటి ఇండస్ట్రీలో రష్మిక మందన్నాకు ఇంతమంది స్టార్ సెలబ్రిటీస్ ఫ్యాన్స్ ఉన్నారా..? ఆమెకు సంబంధించిన ఒక్క ఫేక్ వీడియో వైరల్ అయితేనే ఈ రేంజ్ లో సపోర్ట్ చేస్తున్నారు ఏంటి. అదే ఇంతకుముందు ఎంతోమంది హీరోయిన్ల ఫేక్ వీడియోలు ఫేక్ ఫొటోస్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్కి గురైన కానీ ఏ స్టార్ సెలబ్రిటీ కూడా ఈ రేంజ్ లో రెస్పాండ్ అవ్వలేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి నాగచైతన్య.. రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో పై స్పందించాడు.

” చాలా బాధాకరం ..ఇలాంటివి జరగకుండా ఉంటే బాగుంటుంది “అంటూ తనదైన స్టైల్ లో పెద్ద కొటేషన్ పెట్టుకోచ్చాడు . అయితే నాగచైతన్య మిగతా హీరోయిన్స్ విషయాలలో ఎప్పుడూ నోరు విప్పింది లేదు. ఓ హీరోయిన్ బాధపడుతుంది అన్నా.. ఓ హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ కి గురైంది అన్నా.. తన మాజీ భార్య సమంత ను సోషల్ మీడియాలో పెళ్లి విషయంలో ఏకిపారేసిన.. అసలు తనకు ఆరోగ్యం బాగో లేకపోయినా పట్టించుకోలేదు.

మరి అలాంటిది ఇంతవరకు రష్మికతో ఒక్క సినిమా చేయలేదు , అసలు రష్మికకి ఆయనకు సంబంధమే లేదు . అక్కినేని ఇంటికి రష్మిక కి అస్సలు సంబంధం లేదు. మరి ఎందుకు నాగచైతన్య ఒక్కడే రెస్పాండ్ అయ్యాడు ..? పోనీ ఇండస్ట్రీలో మరో ఏ తెలుగు హీరో అయినా రెస్పాండ్ అయి ఉంటే ఆయనను చూసి రెస్పాండ్ అయ్యాడేమో అని అనుకోవచ్చు .. అది లేదు ఎవరికి లేని దురద నాగచైతన్యకు మాత్రమే ఎందుకు వచ్చింది..? అంటూ కొందరు జనాలు కావాలని వ్యంగ్యంగా కౌంటర్ లు చేస్తున్నారు . మరికొందరు ఆ హీరోయిన్స్ ఫేక్ విషయాలలో లేవని నోరు ఈ హీరోయిన్ ఫేక్ విషయంలో లేస్తుంది ఏం అంటూ నాగచైతన్య ను సినిమా డైలాగ్స్ తో ట్రోల్ చేస్తున్నారు. అయితే చైతన్య కావలని అందరి దగ్గర అటెన్షన్ గ్రాబ్ చేయడానికే ఇలా చేశాడు అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news