Newsఎన్టీఆర్ ' దేవ‌ర‌ ' ... ఫ‌స్ట్ అర‌గంట త‌ర్వాత ఆ...

ఎన్టీఆర్ ‘ దేవ‌ర‌ ‘ … ఫ‌స్ట్ అర‌గంట త‌ర్వాత ఆ 20 నిమిషాలు గోవా స‌ముద్రంలో ర‌చ్చ సామీ..!

టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ దేవర కోసం దర్శకుడు కొరటాల శివతో జత కట్టారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఎన్టీఆర్ – రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై అంచనాలు మామూలుగా లేవు.

భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా సముద్రం నీటి నేపథ్యంలో తెరకెక్కుతుంది. హాలీవుడ్ స్థాయి హంగులతో దేవర సినిమాలు విజువల్స్ ఉండబోతున్నాయి. ఈ సినిమా గురించి మేకర్స్ ఎప్పటికప్పుడు సాలిడ్ అప్డేట్లు రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. రీసెంట్ గానే గోవాలో ఓ ఇంట్రెస్టింగ్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి వెనక్కి వచ్చేసినట్టు తెలుస్తోంది.

ఇక నెక్ట్స్‌ షెడ్యూల్ కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని సమాచారం. తాజాగా గోవా షెడ్యూల్లో రెండు ఫైట్లు షూట్ చేశార‌ని.. ఈ రెండు ఫైట్లు సినిమా ప్రారంభమైన అరగంట తర్వాత ఒకటి, ఇంటర్వెల్‌ బ్యాక్‌ ముందు ఒకటి వస్తాయని తెలుస్తోంది. సముద్రంలో వచ్చే ఈ రెండు యాక్షన్ సీక్వెన్స్ చూస్తుంటే థియేటర్లలో గూస్ బంప్స్ మొత్తం మోత‌ మోగిపోతుందని కూడా మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఏది ఏమైనా దేవరతో మనం సరికొత్త ఎన్టీఆర్‌ను చూడబోతున్నాం అన్న క్లారిటీ అయితే వచ్చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news