Moviesవరుణ్ ఇంటికి వెళ్లి కార్డు ఇచ్చిన పెళ్ళికి రాని ఆ స్టార్...

వరుణ్ ఇంటికి వెళ్లి కార్డు ఇచ్చిన పెళ్ళికి రాని ఆ స్టార్ హీరోయిన్.. అభిమానులకి కొత్త డౌట్లు ..!!

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ – పెళ్లిళ్లు కామన్ . ఒక సినిమా చేస్తున్న టైంలో ప్రేమించడం. ఆ తర్వాత ఇంట్లో పెద్దలకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోవడం చాలా కామన్ గా మనం చూస్తూనే ఉన్నాం . అయితే కొంతమంది అలా పెళ్లి చేసుకున్న తర్వాత మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకుంటున్నారు . కొంతమంది మాత్రం హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు . కాగా రీసెంట్ గానే ఇండస్ట్రీలో టాప్ హీరో వరుణ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్నారు .

ఇటలీలో వీళ్ల పెళ్లి మూడు రోజులపాటు ఘనంగా జరిగింది . మెగా ఫ్యామిలీలోని అందరు హీరోలు అటెండ్ అయ్యారు . అంతేకాదు హీరో నితిన్ కూడా వీళ్ళ పెళ్లికి హాజరై స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు . వరుణ్ – నితిన్ చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే వరుణ్ కి ఇండస్ట్రీలో జాన్ జిగిడి అయిన హీరోయిన్ రాశి ఖన్నా కి వరుణ్ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

అయితే వరుణ్ ఇంటికి వెళ్లి రాశిఖన్నాకు కార్డు ఇచ్చిన సరే ఆమె ఈ పెళ్లికి రాలేదు . దానికి కారణం రాశి కన్నా వరుణ్ నీ ఫ్రెండ్ గా కన్నా లవర్ గానే ఊహించుకుందట . లావణ్య ప్లేస్ లో రాశి ఖన్నా ఉండాలి అంటూ ఎప్పటినుంచో ఆశపడిందట. అయితే తను ఇష్టపడిన వరుణ్ తనకి కాకుండా వేరే వాళ్ళకి దక్కుతున్నాడు అన్న బాధతో ఆమె ఆ పెళ్ళికి వెళ్లలేదు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు రాశిఖన్నా వరుణ్ ని ప్రేమిస్తుంది అని .. వరుణ్ కి కూడా తెలుసు అన్ని తెలిసి.. ఆమె ఇంటికి వెళ్లి కార్డు ఇవ్వడం ఏంటి..? అంటూ మెగా ఫాన్స్ కు కొత్త డౌట్లు వస్తున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news