Newsసినిమాలు మానేసి ఇంట్లో కూర్చో... విజ‌య‌శాంతిని టాలీవుడ్‌లో తొక్కేయాల‌నుకుందెవ‌రు..?

సినిమాలు మానేసి ఇంట్లో కూర్చో… విజ‌య‌శాంతిని టాలీవుడ్‌లో తొక్కేయాల‌నుకుందెవ‌రు..?

సౌత్ ఇండియాలోనే తిరుగులేని లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి మన తెలుగు అమ్మాయి. వరంగల్ లో పుట్టి మద్రాసులో పెరిగిన విజయశాంతి తన పిన్ని విజయ‌లలిత అడుగుజాడల్లో నడుస్తూ తెలుగు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఏడవ సంవత్సరంలోనే బాలనటిగా సినిమాల్లోకి వచ్చిన ఆమెను భారతీరాజా హీరోయిన్‌గా చేశారు. ఆ తర్వాత తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ సరసన కిలాడీ కృష్ణుడు సినిమాలో నటించారు. ఈ సినిమాకు విజయనిర్మల దర్శకత్వం వహించారు.

ప్రారంభంలో గ్లామర్ పాత్రలకే పరిమితమైన విజయశాంతి.. టి.కృష్ణ దర్శకత్వంలో వచ్చిన నేటి భారతం, ప్రతిఘటన సినిమాలతో మరో హీరోయిన్ తనను టచ్ చేయ‌లేని స్థాయికి వెళ్లిపోయారు. అప్పటికే తెలుగులో జయసుధ, జయప్రద, శ్రీదేవి, మాధవి లాంటి స్టార్ హీరోయిన్లు పాతుకుపోయి ఉన్నారు. వారిని సవాల్‌ చేస్తూ విజయశాంతి రూపంలో వెండితెరపై మరో సూపర్ స్టార్ ఉద‌యించింది. నేటి భారతం సినిమాలో నటనకు గాను మొదటిసారిగా ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ నటి అవార్డు కూడా గెలుచుకున్నారు.

1986 నాటికి టాలీవుడ్ లో ఆమె తిరుగులేని స్టార్ హీరోయిన్ అయిపోయారు. ఆమె తర్వాత స్థానాల్లో రాధ‌, సుహాసిని, రజ‌ని, రాధిక ఉండేవారు. 1990 జూన్ నెలలో వచ్చిన కర్తవ్యం సినిమా విజయశాంతి నట జీవితాన్ని మరో మలుపు తిప్పింది. ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ స్ఫూర్తితో మోహన్ గాంధీ దర్శ‌కత్వంలో వచ్చిన ఈ సినిమా అపూర్వ విజయం సాధించింది. 1990 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డ్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ ఉత్తమ జాతియ‌ అవార్డులు సంపాదించి పెట్టింది.

1993లో వచ్చిన పోలీస్ లాక‌ప్ తర్వాత రెండేళ్లపాటుకు ఆమెకు సరైన సక్సెస్ లు రాలేదు. దీంతో ఆమె 1996లో ఒక్క తెలుగు సినిమాలోని నటించలేదు. ఏడాది పాటు విజయశాంతి సినిమా థియేటర్లలో లేదు. దీంతో చాలామంది టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు, కొందరు దర్శకులు కూడా ఇక నీకు సినిమాలు ఎందుకు? నీ పని అయిపోయింది.. ఇంట్లో కూర్చు అని ఘోరంగా అవమానించారు. అంతకుముందు వరకు ఆమెకు వరుసగా అవకాశాలు ఇచ్చిన వారు కూడా ఆమె వైపు కన్నెత్తి చూడలేదు. అయితే ఆమె కసితో దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఒసేయ్ రాములమ్మ సినిమాలో నటించారు.

1997 మార్చి 7న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. విడుదలైన మొదటి రోజు నుంచి అన్ని అంచనాలు మించిపోతూ తెలుగు సినిమా చరిత్రలో అప్పటివరకు ఉన్న రికార్డులు బ్రేక్ చేసింది. ఆ యేడాది తెలుగు స్టార్ హీరోలు నటించిన సినిమాల రికార్డులను ఒసేయ్ రాములమ్మ బ్రేక్ చేసింది. దీనితో ఆమె సౌత్ ఇండియాలో తిరుగులేని లేడీ సూపర్ స్టార్.. లేడీ అమితాబచ్చన్‌గా రికార్డుల్లో నిలిచిపోయారు. తనను అవమానించిన వారికే ఆమె అంతకు మించిన రేంజ్ లో సమాధానం చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news