Moviesహేమచంద్రతో శ్రావణ భార్గవి విడాకులు నిజమేనా..? ఒక్క ఇంటర్వ్యూ తో కుండబద్ధలు...

హేమచంద్రతో శ్రావణ భార్గవి విడాకులు నిజమేనా..? ఒక్క ఇంటర్వ్యూ తో కుండబద్ధలు కొట్టేసిన స్టార్ సింగర్(Video)..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మరోసారి వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సింగర్ శ్రావణ భార్గవి హేమచంద్ర లకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ ఒక పాప కూడా ఉంది . ఎంతో చక్కగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఉన్న ఈ జంటకు ఏ దిష్టి తగిలిందో ఏమో కానీ వీళ్లు విడాకులు తీసుకున్నారు అంటూ గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతుంది.

అయితే దీనిపై వీళ్ళ ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. మేము విడాకులు తీసుకోలేదు అంటూ ప్రకటించారు . అయితే మళ్లీ కొన్నాళ్లకు వీళ్ళు విడాకులు తీసుకున్నారు అన్న ప్రచారం ఊపందుకుంది. దానికి రీజన్ ఈ మధ్యకాలంలో శ్రావణ భార్గవి హేమచంద్ర ఎక్కడ మింగిలై కనిపించలేదు . అంతేకాదు రీసెంట్ గా శ్రావణ భార్గవి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎక్కడ కూడా హేమచంద్ర పేరు ప్రస్తావించకపోవడం వాళ్లు కూడా హేమచంద్రకి సంబంధించిన ఒక్కటంటే ఒక్క క్వశ్చన్ అడగకపోవడం ఆశ్చర్యకరంగా అనిపించింది .

ఎవరైనా సరే అంత పెద్ద సింగర్ ఇంటర్వ్యూకి వస్తే ఖచ్చితంగా ఫ్యామిలీ గురించి ప్రశ్నిస్తారు . అయితే ఇక్కడ ఒక్క ప్రశ్న కూడా హేమచంద్ర గురించి ఆమెని అడగకపోవడంతో నిజంగానే శ్రావణ భార్గవి హేమచంద్ర విడాకులు తీసుకున్నారా..? లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఏవైనా గొడవలు ఉన్నాయా..? అంటూ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. అయితే శ్రావణ భార్గవి ఫ్యాన్స్ మాత్రం వాళ్ళ పర్సనల్ లైఫ్ లో వేలు పెట్టే రైట్ మీకు లేదు అంటూ ట్రోల్ చేసే వాళ్ళకి ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు.

శ్రావణ భార్గవి హేమచంద్ర పేరు చెప్పనంత మాత్రాన వాళ్లు విడాకులు తీసుకున్నట్లు కాదుగా..? ఆఫ్కోర్స్ భార్యాభర్తలు అన్నాక గొడవలు ఉంటాయి. ఆ గొడవల కారణంగా వాళ్ళిద్దరూ దూరంగా ఉండొచ్చు . అయితే అది మొత్తం వాళ్ళ పర్సనల్ . మనకు అసలు ఏం రైట్ ఉందని వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ అవుతున్నాం . మంచిది కాదు దయచేసి శ్రావణ భార్గవిని పీస్ ఫుల్ గా బ్రతకనివ్వండి అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు . దీంతో మరోసారి హేమచంద్ర శ్రావణ భార్గవి విడాకుల మ్యాటర్ వైరక్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news