దర్శకుడు తేజ గురించి అందరికీ తెలిసిందే. పడిలేచిన కెరట. 1960 తేజ బాగా ఉన్నత కుటుంబంలో పుట్టిపెరిగాడు. తల్లి మృతి తండ్రి ఆస్తులు పోవడంతో తేజతో పాటు ఆయన సోదరీమణులను బంధువులు పెంచి పెద్ద చేశారు. తేజ ఎప్పుడు సొంత కాళమీద నిలబడాలనే ఆరాటపడేవాడు. అలా సినిమా ఇండస్ట్రీలో టీ.కృష్ణ, సినిమాటో గ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి లాంటి వారి దగ్గర పలు విభాగాలలో పనిచేశారు.
ఆ తర్వాత దర్శకుడు రాంగోపాల్ వర్మ దగ్గర శివ సినిమాకి అన్నీ విభాగాలలో పనిచేశాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన రాత్రి, మనీ సినిమాలకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. ఆ సమయంలోనే నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి తేజకి పరిచయం అయ్యాడు. కృష్ణవంశీ కూడా ఇదే బ్యాచ్. అయితే, తేజ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. శ్రీవల్లి తో లవ్ లో పడిన తేజ స్నేహితుల సహాయంతో పెళ్లి చేసుకున్నట్టు చెప్తారు.
వారిలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయింది జేడీ అని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తేజ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని..ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వచ్చేసిందని..అప్పట్లో మారుతి 800 కారు ఉంటే అది వేసుకొని అన్నపూర్ణ స్టూడియో దగ్గర్లో కలిసేవాళ్ళమని చెప్పుకొచ్చారు. శ్రీవల్లి, తేజ ఒక్కటవడానికి కారణం నేనే అని..ఇలా చాలా విషయాలు జేడీ చెప్పారు.
కానీ, అంత సినిమాటిక్ గా ఏమీ నా పెళ్లి జరగలేదని..నా పెళ్లి విషయంలో జేడీ చెప్పిందంతా సోది సొల్లు అని దర్శకుడు తేజ కూడా క్లారిటీ ఇచ్చారు. ఏదో హైప్ కోసమే జేడీ అలా చెప్పాడు గానీ, మాది లవ్ మ్యారేజ్ అయినా అంత పెద్ద గొడవలేమీ జరగలేదని చాలా సింపుల్ గా మా పెళ్లి జరిగిందని తేజ చెప్పాడు. మా పెళ్లికి నాగేశ్వరరావు గారి పెద్ద కోడలు అయిన అక్కినేని వెంకట్ గారి భార్య సాయం చేసిందని తేజ చెప్పాడు.