టాలీవుడ్ లో సినిమా రిలీజ్ డేట్ లో విషయంలో ఎప్పుడు గందరగోళం నడుస్తూనే ఉంటుంది. ఒకేసారి రెండు.. మూడు పెద్ద సినిమాలు వస్తే థియేటర్ల కోసం యుద్ధాలే జరుగుతున్నాయి. గత నాలుగైదేళ్లుగా సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఎలాంటి ? యుద్ధాలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. తాజాగా టాలీవుడ్ లో మరోసారి వాయిదాల పర్వం మొదలైంది. ఒకేసారి ముగ్గురు మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు పోస్ట్ ఫోన్ అవడంతో గందరగోళం మొదలైంది.
చివరకు తమ సినిమాలు వాయిదా వేయటం ఆ హీరోలకు కూడా నచ్చలేదన్నారు. నవంబర్ 24న నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే డెవిల్ ఆ డేట్ కి రావటం లేదు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. అయితే కొత్త విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. ఈ సినిమా డిసెంబర్.. జనవరిలో కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ లు లేవు. వచ్చేయేడాది ఫిబ్రవరి కి వెళ్ళిపోతుందని అంటున్నారు.
ఇక ఈ నెలలో వాయిదా పడిన మరో సినిమా ఆదికేశవ. మెగా హీరో వైష్ణవ తేజ్ – శ్రీలీల కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాని ప్రస్తుతం క్రికెట్ ప్రపంచ కప్ నేపథ్యంలో ప్రేక్షకులు రారేమో అని భయపడి వాయిదా వేశారు. నవంబర్ 10 విడుదల కావలసిన ఆదికేశవను నవంబర్ 24కు వాయిదా వేశారు. ఇక విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వాయిదా పడుతోంది. ఈ సినిమా ముందుగా డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ అనుకున్నారు. అయితే ఆ టైంలో నాని, నితిన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
దీంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వాయిదా అనివార్యమైంది. దీనిపై హీరో విశ్వక్సేన్ ఫైర్ అయ్యాడు. అయితే నిర్మాత నాగే వంశీ మాత్రం సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉందని.. పాట బ్యాలెన్స్ ఉందని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉన్నాయి అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా డిసెంబర్ 29న రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే సంక్రాంతి ముందు ఆ డేట్ కు రిలీజ్ చేయడం కు ఇష్టం లేదంటున్నారు.. ఏది ఏమైనా తమ సినిమాలు వాయిదా పడటం అటు వైష్ణవ్‌తేజ్‌కు, ఇటు విశ్వక్‌సేన్ ఇష్టం లేదని తెలుస్తోంది.