టాలీవుడ్ లో ఒకేసారి అందరి పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతాయి. లేకపోతే ఎవరి సినిమా రిలీజ్ కావటం లేదు. ఈ సమ్మర్ అంత అలా వేస్ట్ చేసేసారు. ఒక పెద్ద హీరో సినిమా కూడా రిలీజ్ కాలేదు.. కనీసం వినాయక చవితికి కూడా ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ కాలేదు. దసరాకు ఏకంగా మూడు మంచి సినిమాలు వచ్చేసాయి. ఇక నవంబర్ నెల అంతా ఒక్కటంటే ఒక్క హీరో సినిమా కూడా లేదు. నాలుగు వారాలు.. 30 రోజులు వందల కొద్ది స్క్రీన్లు ఖాళీగా ఉండే పరిస్థితి. థియేటర్లలోకి రావడానికి చెప్పుకోదగ్గ హీరోలు ఒక్కళ్లు కూడా ముందుకు రావటం లేదు.
మహేష్, ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోల సంగతి సరే సరే. వాళ్లకు పండగలు కావాలి.. సరైన టైం కావాలి.. కనీసం మిడిల్ రేంజ్ హీరోలా సినిమాలు కూడా నవంబర్లో థియేటర్లలోకి రావడం లేదు. నవంబర్ తొలివారంలో కీడాకోలా – పొలిమేర 2 – నరకాసుర సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాలలో కంటెంట్ ఉంటే తప్ప కచ్చితంగా ధియేటర్లకు వచ్చి ఈ సినిమా చూసే ప్రేక్షకులకు ఉండరు. ఇక రెండో వారంలోనూ అన్వేషి వ్యూహం – అలా నిన్ను చేరి సినిమాలు వస్తున్నాయి.
ఇదే వారం లారెన్స్ నటించిన జిగర్‌తండా డబుల్ ఎక్స్ కూడా వస్తోంది. అది డబ్బింగ్ సినిమా లారెన్స్ ఉన్నా కూడా ఆయన చంద్రముఖి 2 రిజల్ట్ ఎలా ఉందో ? చూశాం. ఇక నవంబర్ మూడో వారంలో స్పార్క్ – మంగళవారం – సప్త సాగరాలు దాటి సినిమాలు వస్తున్నాయి. ఉన్నంతలో మంగళవారం సినిమా కాస్త ఎట్రాక్ట్ చేస్తుంది. ఇందులో కూడా హీరో లేడు.. పాయల్ మాత్రమే పెద్ద ఆకర్షణ. ఇక నాలుగో వారంలో ఆదికేశవ – కోటబొమ్మాలి సినిమాలు వస్తున్నాయి. ఆది కేశవలో మాత్రం వైష్ణవ తేజ్ – శ్రీలీల ఉన్నారు.
అయితే ఈ సినిమాపై కూడా అనుకున్నంత బజ్ లేదు. ఉన్నంతలో కళ్యాణ్‌రామ్ డెవిల్ వస్తుంది అనుకుంటే ఆ సినిమాను కూడా పోస్ట్ పోన్ చేసేసారు. ఏది ఏమైనా నవంబర్ టాలీవుడ్ సినిమా అంతాబోసిపోయినట్టుగా చాలా డల్ గా ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక డిసెంబర్ తొలి వారం నుంచి పెద్ద హీరోల సినిమాలు సందడి మొదలుకానుంది. డిసెంబర్, జనవరి నెలలో క్రేజీ సినిమాలు లైన్లో ఉన్నాయి. నవంబర్ నెల అంతా టాలీవుడ్ ట్రేడ్ అంతా థియేటర్లలో ఈగలు తోలుకోవటంతోనే సరిపోతుంది.