నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా దసరా విన్నర్‌గా నిలిచింది. 10వ రోజుకు చేరుకున్నా కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇంకా సక్సెస్‌ఫుల్‌గా ఆడుతోంది. పైగా దసరాకు రవితేజ టైగర్ నాగేశ్వరరావు, తమిళ హీరో విజయ్ డబ్బింగ్ సినిమా లియోకు పోటీగా థియేటర్లలోకి వచ్చింది. తొలి రోజు అంతంత మాత్రం టాక్ వచ్చినా కూడా భగవంత్ కేసరి బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ ముగిసే సరికే క్లీన్ హిట్‌గా నిలిచింది.
ఈ సినిమా విడుదలై 10వ రోజుకు చేరుకున్నా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా జోష్ తగ్గలేదు. వసూళ్లు కూడా స్టడీగానే ఉన్నాయి. ఇప్పటికే 85 శాతం రికవరీ అయ్యింది. చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దాటేసి.. లాభాల్లోకి రాగా కొన్ని ఏరియాల్లో మాత్రమే ఇంకా బ్రేక్ ఈవెన్ చేరుకోవాల్సి ఉంది. ఇక ఈ సినిమా 9 రోజుల కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఏరియాల వారీగా చూస్తే 9 రోజుల్లో.. నైజాంలో రూ. 15.22 కోట్లు – సీడెడ్‌లో రూ. 12.06 కోట్లు – ఉత్తరాంధ్రలో రూ. 5.17 కోట్లు – ఈస్ట్ రూ. 2.79 కోట్లు – వెస్ట్ రూ.2.44 కోట్లు – గుంటూరు రూ. 5.36 కోట్లు – కృష్ణాలో రూ. 3.01 కోట్లు – నెల్లూరులో రూ.2.07 కోట్లు వచ్చాయి. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి రూ. 4.77 కోట్లు, ఓవర్సీస్ రూ.7.17 కోట్లు రాబట్టింది. ఓవరాల్‌గా 9 రోజుల్లో భగవంత్ కేసరి ప్రపంచ వ్యాప్తంగా రూ. 60.06 కోట్లు షేర్, 119.51 గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది.
ఈ సినిమాతో బాలయ్య వరుసగా మూడో సెంచరీ సినిమా కొట్టగా.. అటు ఓవర్సీస్‌లో వరుసగా మూడో మిలియన్ డాలర్ల సినిమా చేసిన రికార్డ్ సొంతం చేసుకున్నారు. మరో వారం రోజుల వరకు టాలీవుడ్‌లో సరైన సినిమాలు లేకపోవడంతో భగవంత్ కేసరికి తిరుగులేదు.