అమలాపాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. ఆమె మలయాళీ అమ్మాయి అయినా కూడా తమిళంతో పాటు తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తెలుగు, తమిళ ఆడపడుచుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అమలాపాల్ అక్టోబర్ 26, 1991లో కేరళలోని ఎర్నాకులంలో మలయాళీ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. వీరి కుటుంబం కేరళలోని కొచ్చిలో స్థిరపడింది. అమలాపాల్ కు మంచి బలమైన కుటుంబ నేపథ్యం ఉంది.
ఆమె తండ్రి వర్గీస్ పాల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.. తల్లి అన్నీస్‌పాల్ గృహిణి .. ఆమెకు ఓ అన్నయ్య కూడా ఉన్నాడు . అమలాపాల్ తన విద్యాభ్యాసాన్ని కొచ్చి లో పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమె హీరోయిన్ అవ్వాలన్న కోరికతో ముందుగా మోడలింగ్లో ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ అయ్యాక వెండితెరపై హీరోయిన్గా రాణించింది. అమల తెలుగులో బెజవాడ, రామ్ చరణ్ తో నాయక్ , అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో, నానితో జెండాపై కపిరాజు , మేము, ఆమె వంటి సినిమాలలో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.
అమలాపాల్ అసలు పేరు అనక.. ఆ తర్వాత ఆమె సినిమాల్లోకి వచ్చిన క్రమంలో అనక పేరు కాస్త అమలాపాల్ గా మార్చుకుంది. ఈ పేరు ఆమెకు బాగా కలిసి వచ్చింది. ఆమె కెరీర్ ఒక్కసారిగా మార్చేసింది. అమలాపాల్ తమిళ సినిమాలలో నటిస్తున్న క్రమంలోనే తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్‌తో ప్రేమలో పడింది. విజయ్ దర్శకత్వం వహించిన 3 – 4 సినిమాలలో ఆమె హీరోయిన్గా నటించింది. ఈ క్రమంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి జరిగిన రెండేళ్లకే మనస్పర్ధలు వచ్చిన నేపథ్యంలో విడాకులు తీసేసుకున్నారు.
విజయ్ కుటుంబం అమలాపాల్ పై రకరకాల కండిషన్లు పెట్టిందని.. మరోవైపు అమలాపాల్ కు ధనుష్ కి మధ్య సంబంధం ఉందన్న అనుమానాల నేపథ్యంలోనే విజయ్ ఆమెకు విడాకులు ఇచ్చేసాడు అంటూ రకరకాల ప్రచారం కూడా జరిగింది. ఏది ఏమైనా వీరిద్దరూ విడిపోయారు. ఇక అమలాపాల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట్లో ఎలా రచ్చ ? చేస్తుందో చూస్తూనే ఉంటాం