సినిమా ఇండస్ట్రీ అంటే.. దైవంగా భావించేవారు చాలా మంది ఉన్నారు. చిత్తూరు వీ. నాగయ్య నుంచి ఎన్టీఆర్, అక్కినేని వరకు కూడా కుల ప్రస్తావనలు తీసుకువచ్చేవారు. అందరూ కళామతల్లి ముద్దు బిడ్డలే అని అన్నగారుపదే పదే చెప్పేవారు. అయితే.. రాజకీయ జోక్యం పెరిగిపోయిన దరిమిలా.. ఇండస్ట్రీలో కుల సంఘాలు కూడా పెరిగాయి. ఇది తమిళనాట ఎక్కువగా ఉండేది.
అయితే.. అన్నగారు మాత్రం సహించేవారు కాదు. టాలెంట్ ఎవడబ్బ సొమ్మూ కాదు. కులాలు కులాలు అని కొట్టుకు చావడానికి!
అని చెప్పేవారు. ఈ క్రమంలోనే అన్నగారు.. తన సినిమాల్లో కులాలకు వ్యతిరే కంగా పాటలు కూడా రాయించారు. తెలుగు జాతి మనది.. అనే పాట ఆ సమయంలోనే తెరమీదికి వచ్చిం ది. అంతేకాదు.. కుల సంఘాలుగా విడిపోవడాన్ని రాజకీయాల జోక్యం పెరగడాన్ని కూడా అన్నగారు సహించేవారు కాదు.
అసలు ఎవరైనా వచ్చి కులాల ప్రాతిపదికన అన్నగారి దగ్గర మాట్లాడే ప్రయత్నం చేస్తే.. ఆయన నిలువ రించేవారు. కులాల ప్రస్తావన ఎందుకు లేండి.. అందరూ ఇండస్ట్రీ మనుషులే.. అందరూ కళాకారులేఅని అనేవారు. కాకపోతే.. స్థానికతను చూసుకోండి అని సలహా ఇచ్చేవారు. రెండు రాష్ట్రాల్లోనూ ఉన్న కళాకారు లు.. కవులను ప్రోత్సహించాలని ఆయన చెప్పేవారు.
క్యాస్ట్ ఫీలింగులు తీసుకువచ్చి ఒకరిని తొక్కేస్తాం అంటే ఎవరిని అయినా సహించను… తాట తీస్తా అంటూ ఎన్టీఆర్ వార్నింగులు ఇచ్చేవారట. ఇలా.. అన్నగారు ఎక్కువగా కులాల జోలికి పోయే వారు కాదు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి చూద్దామన్నా కనిపించడం లేదన్న విషయం తెలిసిందే. కులాలు, రాజకీయాల పరంగా తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడో చీలిపోయింది.