టాలీవుడ్ యం టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ చేస్తున్న సినిమా దేవర . ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా కావడంతో సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి . అంతేకాదు ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వికపూర్ తెలుగులోకి డెబ్యూ ఇవ్వబోతూ ఉండడంతో శ్రీదేవి ఫాన్స్ కూడా ఈ సినిమాను చూసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .
అయితే కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని డిసైడ్ అయినప్పుడే ఈ సినిమాలో ఆ హీరోయిన్ అయితే బాగుంటుంది అంటూ ఫిక్స్ అయిపోయాడట . ఆ ముద్దుగుమ్మ కూడా ఈ సినిమాను యాక్సెప్ట్ చేసి సైన్ కూడా చేసింది. అయితే లాస్ట్ మూమెంట్లో అగ్రిమెంట్ పేపర్లను క్యాన్సిల్ చేసుకునేసింది. ఆ బ్యూటీ మరెవరో కాదు అలియా భట్ . స్టార్ హీరో రణ్బీర్ కపూర్ భార్య అలియాభట్ దేవర సినిమాలో హీరోయిన్గా అనుకున్నారు.
అయితే ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఈ సినిమా నుండి తప్పుకుంది .ఒకవేళ అలియా భట్ ప్రెగ్నెంట్ కాకుండా ఉంటే అసలు జాన్వి తెలుగులో ఛాన్స్ దక్కించుకునేదే కాదు అంటున్నారు అభిమానులు . చూడాలి మరి ఈ సినిమాతో జాన్వి ఎలా తన స్థానాన్ని హై రేంజ్ లో మార్చుకోబోతుందో..?