Newsవరుణ్ పెళ్లికి చైతన్యకు అహ్వానం..మెగా మర్యాద అంటే ఇదే ..చూసి నేర్చుకోండి..!!

వరుణ్ పెళ్లికి చైతన్యకు అహ్వానం..మెగా మర్యాద అంటే ఇదే ..చూసి నేర్చుకోండి..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే . నవంబర్ ఒకటవ తేదీ వీళ్ళ పెళ్లి గ్రాండ్గా ఇటలీలో జరగబోతుంది . అయితే ఈ పెళ్లికి వరుణ్ చెల్లి నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్యకు మెగా ఫ్యామిలీ నుండి ఆహ్వానం అందింది అన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది .

నిజానికి నిహారిక – చైతన్య ఈ మధ్యనే విడాకులు తీసుకున్నారు . వాళ్ళిద్దరు తెగదుంపులు కూడా చేసేసుకున్నారు . మరి అలాంటి వాళ్లకి మెగా కుటుంబం ఆహ్వానం పంపించాల్సిన అవసరం లేదు . నిహారిక సంబంధం కుదరకముందే వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అని.. కుటుంబ పరంగా ఇద్దరూ బాగా క్లోజ్ అని తెలుస్తుంది .

ఆ చనువుతోనే వరుణ్ లావణ్య పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రికను మెగాస్టార్ చిరంజీవి – నాగబాబు – పద్మ స్వయంగా వెళ్లి అందజేశారు అన్న వార్త వైరల్ అవుతుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ హంగామా చేస్తున్నారు . మెగా మర్యాద అంటే ఇదే చూసి నేర్చుకోండి అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news