News' భ‌గ‌వంత్ కేస‌రి ' వ‌ర్కింగ్ స్టిల్స్ చూస్తారా ... ...

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ వ‌ర్కింగ్ స్టిల్స్ చూస్తారా … బొమ్మ‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ క‌ళొచ్చిందే ( ఫొటోలు)

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్యకి జోడిగా కాజల్‌ అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. శ్రీలీల బాలయ్య కూతురు పాత్రలో కనిపించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న భగవంత్‌ కేసరి సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ నుంచి u / a సర్టిఫికెట్ సొంతం చేసుకున్న భగవంత్‌ కేసరి సినిమా టోటల్ రన్‌ టైమ్ 155 నిమిషాలుగా ఉంది.

సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో పాటు టీజర్లు, ట్రైలర్లకు నందమూరి అభిమానులతో పాటు సగటు సినీ అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సినిమాపై మంచి హైప్‌ ఉండడంతో యూఎస్లో ఫ్రీ సేల్స్ చాలా జోరుగా సాగుతున్నాయి. రిలీజ్‌కు ముందే అక్క‌డ ఈజీగా హాఫ్ మిలియ‌న్ మార్క్ డాల‌ర్ల‌ను క్రాస్ చేసేలా ఉంది.

తాజాగా ఈ సినిమా నుంచి కొన్ని వర్కింగ్ స్టిల్స్ మేకర్స్ రిలీజ్ చేశారు. కాజల్ అగర్వాల్, శ్రీలీల, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఇవి ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి. ఈ స్టిల్ చూస్తుంటే బొమ్మకు బ్లాక్ బస్టర్ క‌ళ‌ వచ్చేసిందని నెటిజన్లు.. నందమూరి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందించారు. బాలయ్య కెరీర్ లోనే అత్యధికంగా రు. 110 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకు జరిగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news