Newsఅంద‌రూ వ‌దిలేసినా అత‌డు నావెన‌కున్నాడు... ఆ హీరోపై క‌ల‌ర్స్ స్వాతి కామెంట్ల...

అంద‌రూ వ‌దిలేసినా అత‌డు నావెన‌కున్నాడు… ఆ హీరోపై క‌ల‌ర్స్ స్వాతి కామెంట్ల అర్థం ఏంటి ?

కలర్స్ స్వాతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా యేళ్లు సినిమాల‌కు గ్యాప్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆమె కొత్త సినిమాలతో మన ముందుకు వస్తోంది. ఇక ఇటీవల కాలంలో కలర్స్ స్వాతి విడాకులు తీసుకుందంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే గతవారం స్వాతి నటించిన మంత్ ఆఫ్‌ మధు సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. కుర్ర హీరో నవీన్ చంద్ర – స్వాతి కలిసి నటించిన ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూ వచ్చాయి.

ఈ సినిమాకు మౌత్ టాకు కూడా అంతగా రాలేదు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమాకి నెగటివ్ రివ్యూలు రావడంతో టీం కాస్త నిరాశ చెందినట్టు ఉంది. అందుకే రివ్యూ రైటర్ల మీద దర్శకుడు, హీరోయిన్ ప్రెస్మీట్లోనే ఫైర్ అయ్యారు .అది ఒక ఆర్ట్ ఫిలిం.. మినిమం డిగ్రీ చదివిన వాళ్ళకి ఆ సినిమా అర్థమవుతుందని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లో నవీన్ చంద్ర మాట్లాడిన మాటలు.. స్వాతి తన ఫ్యామిలీ మెంబర్ అంటూ చెప్పిన మాటలు టాలీవుడ్ లో అంతర్గతంగా చాలా చర్చ‌కి వచ్చాయి.

నవీన్ చంద్ర స్వాతి తన ఫ్యామిలీ మెంబర్ అని ఒక్కసారిగా అనడం.. ఆ టైంలో స్వాతి కన్నీళ్లు పెట్టేసుకుంది. అయితే తాను అలా ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నానో ? స్వాతి తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఒకరు మనల్ని అర్థం చేసుకొని మన పక్కన అండగా నిలబడటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.. నా విషయంలో ఇలాంటివి చాలా చాలా అరుదు.. ఎవరూ లేనప్పుడు నవీన్ చంద్ర నా పక్కన ఉన్నాడు అంటూ ఆమె గర్వంగా చెప్పింది.

నవీన్ చంద్రను కలర్స్ స్వాతి ఇంతగా ఆకాశానికి ఎందుకు ఎత్తేసింది అన్నదానిపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఆమె భర్తతో విడాకులు తీసుకుంటుందన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇటు సినిమా కెరియర్ కూడా ఆశాజనకంగా లేదు. ఇలాంటి టైంలో నవీన్ చంద్ర.. కలర్స్ స్వాతి దగ్గరవుతున్నార‌న్న‌ వార్తలతో పాటు వీరిద్దరూ కలిసి మంత్ అఫ్ మధు సినిమా చేయటం కూడా రకరకాల పుకార్లకు తావిచ్చినట్లు అయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news