News' భ‌గ‌వంత్ కేస‌రి ' లో ఇద్ద‌రు బాల‌య్య‌లా... ట్రైల‌ర్‌లో చూసింది...

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ లో ఇద్ద‌రు బాల‌య్య‌లా… ట్రైల‌ర్‌లో చూసింది కాదు సినిమాలో వేరే…!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న సినిమా భగవంత్‌ కేసరి. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మరో యంగ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల‌ బాలయ్య కూతురు పాత్రలో కనిపించనున్నారు. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 19న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరో అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో బాలయ్యను ఢీకొట్టే విల‌న్‌గా కనిపించనున్నారు.

ఇప్పటికే భగవంత్‌ కేసరి నుంచి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు, టీజర్లు, ట్రైలర్ అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి అట. అనిల్ రావిపూడి కిఇప్పటికే వరుసగా 6 సూపర్ డూపర్ హిట్లు ఉండడంతో సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. అందుకే ఈ సినిమాకు బాలయ్య కెరీర్ లోనే అత్యధికంగా 110 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్లో చూపించింది కొంత మాత్రమే అని.. సినిమాలో ఇంకా ఎన్నో యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్స్ దాగి ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ ఈ సినిమాలో మరో పవర్ఫుల్ పాత్రలో కూడా కనిపిస్తాడన్న‌ టాక్ ట్రైలర్ లో చూసింది కొంత మాత్రమే అని సినిమాలో చూడాల్సింది చాలా ఉందని.. బాలయ్య ద్విపాత్ర వినయం అదిరిపోయే ట్విస్ట్ అని తెలుస్తుంది.

బాల‌య్య ద్విపాత్రాభిన‌యం వార్తలు బయటికి రావడంతో భగవంత్ కేస‌రిపై అంచ‌నాలు మరింతగా పెంచేసిన‌ట్లైంది. ఏదేమైనా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతోన్న కొద్ది భ‌గ‌వంత్ కేస‌రిపై అంచ‌నాలు అయితే పీక్స్‌కు వెళ్లిపోతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news