Newsమెగాస్టార్ 157వ సినిమాకు ఇంట్ర‌స్టింగ్ టైటిల్‌... ఆ సూప‌ర్ హిట్ టైటిల్...

మెగాస్టార్ 157వ సినిమాకు ఇంట్ర‌స్టింగ్ టైటిల్‌… ఆ సూప‌ర్ హిట్ టైటిల్ వాడేస్తున్నారే..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో భారీ సోషియో ఫాంట‌సీ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అనౌన్స్ అయిన ఈ సినిమాపై మెగా అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్‌లోను మంచి అంచనాలు ఉన్నాయి. బింబిసారా లాంటి సోషియో ఫాంట‌సీ సినిమాను చాలా కొత్తగా తరకెంచి సూపర్ హిట్ కొట్టిన మల్లిడి వశిష్ట డైరెక్టర్ చేస్తున్న ఈ సినిమా కూడా అదే సోషియో ఫాంట‌సీ నేప‌థ్యంలోనే తెరకెక్కనుంది.

మెగాస్టార్ కెరీర్ లో 157వ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు చోట కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని సమాచారం. ద‌ర్శ‌కుడు వ‌శిష్ట ప్ర‌స్తుతం చిరుకు జోడీగా సెట్ అయ్యే హీరోయిన్ల కోసం వేట మొద‌లు పెట్టారు.

టాలీవుడ్ వర్గాల క్రేజీ న్యూస్ ప్రకారం ఈ సినిమాకు ముల్లోకి వీరుడు అనే టైటిల్ మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి మాదిరిగా ఈ సినిమాలో పాత్ర ఆడియెన్స్‌ మనసులో గుర్తుండిపోతుందట. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చేది చివర్లో ఈ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news