Movies"శ్రీలీలకి ఉన్నది నాకు లేనిది అదే".. ఓపెన్ గానే చెప్పేసిన కాజల్...

“శ్రీలీలకి ఉన్నది నాకు లేనిది అదే”.. ఓపెన్ గానే చెప్పేసిన కాజల్ అగర్వాల్..!!

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ రీసెంట్ గా నందమూరి బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాలో ఆయనకు జోడిగా నటించింది. ఇందులో శ్రీలీల బాలయ్యకు కూతురు పాత్రలో కనిపించబోతుంది . దసరా కానుకగా ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .

ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనింది . ఈ చిత్రంలో ఆమె పేరు కాత్యాయని అంటూ రివీల్ చేసింది . అంతేకాదు ఈ సినిమా చాలా చాలా ఎంటర్టైనింగ్ ఇస్తుందని.. అంతేకాదు బాలయ్యను మనం సరికొత్త లుక్స్ లు చూడబోతున్నాం అంటూ కూడా చెప్పుకొచ్చింది .

ఇదే క్రమంలో ఇప్పుడు వచ్చే జనరేషన్ హీరోయిన్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి..? అంటూ యాంకర్ ప్రశ్నించగా..” ఓ హీరోయిన్ కి ఉండాల్సిన ప్రధాన లక్షణం పర్సనల్ గ్రోత్ ..సినిమాలతో పాటు అది కూడా చాలా ఇంపార్టెంట్ .. జీవితంలో సినిమాలతో పాటు ఇంకా చాలా చేయాలి .. నేను కూడా సినిమాను బాగా ప్రేమిస్తాను .. నా మొదటి లవ్ కూడా అదే కానీ పరసనల్ లైఫ్ లో సినిమాలతో పాటు ఇంకా చాలా ఉంటాయి. వాటిని కూడా మనం ఫుల్ ఫీల్ చేయాలి.. రెండిటిని బ్యాలెన్స్ చేసినప్పుడే మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ..ఆ విషయంలో శ్రీ లీలా చాలా చాలా గ్రేట్ శ్రీలీలకు చాలా పొటెన్షియల్ ఉంది ..చాలా హార్డ్ వర్క్ చేస్తుంది తనకు ఏం కావాలో బాగా తెలుసు.. దానిపైనే ఫోకస్ చేస్తుంది శ్రీలీల ఈ జనరేషన్ కి ఎంతో ఇన్స్పిరేషన్ “అంటూ ఓ రేంజ్ లో పొగిడేసింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news