మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన సినిమా టైగర్ నాగేశ్వరరావు. దొంగాట ఫేం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ గజదొంగ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది గుంటూరు జిల్లాలోని బాపట్ల తాలూకాలోని స్టోర్ గజదొంగ బయోపిక్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఒరిజినల్ గా చూస్తే గజదొంగ నాగేశ్వరరావును ఎన్కౌంటర్ చేసినట్టు చెబుతారు. ఇప్పటికీ స్టువర్టుపురం పరిసర ప్రాంతాల్లో ఎవరిని అడిగినా ఇదే మాట చెబుతారు.
మరి సినిమాలో క్లైమాక్స్‌లో రవితేజ పాత్రను ఇలాగే ముగించారా ? ఇలాంటి ట్రాజడీ ఎండింగ్ ను తెలుగు ప్రేక్షకులు అంగీకరిస్తారా ? అన్న ప్రశ్నలు ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారాయి. ఇదే విషయాన్ని దర్శకుడు వంశీని అడిగితే టైగర్ నాగేశ్వరరావు సినిమాలో క్లైమాక్స్ ఎలా ఉంటుందో ? సినిమా చూసి తెలుసుకోమని చెబుతున్నారు. రవితేజ పాత్రను ఎన్కౌంటర్ ఎపిసోడ్ తో ముగించేనా లేదా అన్న విషయాన్ని తన ఇప్పుడే చెప్పలేనన్నారు.
ఇది ఒక కమర్షియల్ ఫిలిం.. అందరూ అనుకుంటున్నట్టు ఎండ్ చేస్తే బాగోదు.. కాబట్టి ఎలా ఎండ్ చేశానో సినిమా చూసి తెలుసుకోండి అంటున్నారు. సినిమాను దర్శకుడు వంశీ యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారా ? లేదా యదార్ధ ఊహాగానాల ఆధారంగా తీసారా అన్నది సస్పెన్స్ గా మారింది. సినిమాలో నిజం ఎంత ? కల్పితం ఎంత అనే విషయాన్ని తాను సపరేట్ చేసి చూడలేదంటున్నారు.
కేవలం ఓ దొంగ జీవితాన్ని కమర్షియల్ ఫార్మాట్లో చెప్పే ప్రయత్నం మాత్రమే చేశానని అంటున్నాడు. వంశీ చెప్పిన విషయాలను బట్టి చూస్తే రవితేజ పాత్రను చివరలో ఎన్కౌంటర్ చేయరని.. అతడు గజదొంగ అయినా పేదల కోసం కష్టపడిన రాబిన్ హుడ్ పాత్రలో రియల్ హీరోగా చూపించబోతున్నారని తెలుస్తోంది.