సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎదగాలన్నా, దర్శకుడిగా ఎదగాలన్నా కాస్ట్ కొంతవరకూ సహాయపడుతుంది. వీడు మన ఊరు వాడు, మన కులం వాడు అంటూ దగ్గరికి తీసుకొని పైకి లాక్కొస్తారు. ఇక ఎప్పటి నుంచో ఇండస్ట్రీ కొందరు పెద్దల చేతుల్లో కొనసాగుతుందని చెప్తున్నారు. ఇందులో కొంత వాస్తవం కూడా లేకపోలేదు. 24 విభాగాలలో ఎక్కువగా కులం వల్లే మంచి టెక్నీషియన్స్ అవుతారనేది ఒప్పుకొని తీరాల్సిందే.
అదే నియమం హీరోయిన్స్ కి వర్తించదు అంటుంటారు. ఎందుకంటే, మన సౌత్ సినిమా ఇండస్ట్రీలలో ఎక్కువగా పర భాషా నటీమణులే ఏలుతున్నారు. ఎక్కువగా ముంబై మోడల్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్స్ గా ఓ వెలుగు వెలిగిన వారే. గత కొంతలాకంగా బెంగుళూరు, కేరళ కుట్టీలు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా సందడి చేస్తున్నారు. మలయాళం, కన్నడ చిత్ర సీమలో బడ్జెట్‌తో సినిమాలు రూపొందేవి.
కాబట్టి అక్కడ నటించే హీరోయిన్స్ కి రెమ్యునరేషన్స్ చాలా తక్కువ. అదీ కాక సౌత్ లో అన్నిటికంటే తెలుగు ఇండస్ట్రీ చాలా పెద్దది. భారీ బడ్జెట్ చిత్రాలు, బడా హీరోలు ఉన్న ఈ ఇండస్ట్రీలో రెండు హిట్స్ అందుకుంటే చాలు రెమ్యునరేషన్ కోట్లలో అందుకోవచ్చు. అదే మాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ ఉడ్ నుంచి హీరోయిన్స్ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి ముఖ్య కారణం అవుతోంది.అందుకే, తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా తెలుగమ్మాయిలను తీసు
కోరు అనే అపవాదు ఒకటుంది. ఇక ఇలాంటి నేపథ్యంలో హీరోయిన్ ది ఏ కులం అయితే ఏంటీ ఏకంగా భాష, మతమే మారిపోయినప్పుడు మిగతా వాటితో పనేంటి. డేట్స్ ఇవ్వడం..కావలిసినట్టుగా కమిటవడం ..ఈ రెండు హీరోయిన్స్ కి అభ్యంతరం లేకపోతే చాలు..దర్శక నిర్మాతలు, హీరోలు పట్టీ పట్టీ వారినే తమ సినిమాలలో పెట్టుకుంటున్నారు. పెంచి పోషిస్తున్నారు.