తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నారు. ఎన్నో హిట్ సినిమాలలో నటించిన వెంకటేష్ గత కొన్నేళ్లుగా మల్టీ స్టారర్ సినిమాలలో నటించేందుకు ఆసక్తి చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు – రామ్ – రానా – నాగచైతన్య లాంటి హీరోలతో కలిసి వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాలలో నటించి సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టారు.
ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో నటించిన హిట్ సినిమాలలో గోవిందుడు అందరివాడేలే సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. వాస్తవానికి ఈ సినిమా వెంకటేష్ – రామ్ చరణ్ కాంబినేషన్లో రావాల్సి ఉన్నా అలా జరగలేదు. కృష్ణవంశీ ముందుగా సీనియర్ హీరో శ్రీకాంత్ పోషించిన పాత్ర కోసం విక్టరీ వెంకటేష్ ని అడిగారు.
అయితే ఆ పాత్ర వెంకటేష్‌కు ఎందుకో గాని నచ్చలేదు. ఈ పాత్ర చేయలేనని దర్శకుడు కృష్ణవంశీకి చెప్పేశారు. దీంతో ఆ ప్లేస్‌లో సీనియర్ హీరో శ్రీకాంత్‌ను తీసుకున్నారు. శ్రీకాంత్ మొండి బాబాయ్ పాత్రలో ఎలా ఒదిగిపోయారో చూసాం. బండ్ల గణేష్ నిర్మాత వ్యవహరించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ – కమలిని ముఖర్జీ – జయసుధ తదితరులు కీలకపాత్రలో పోషించారు.
2004 అక్టోబర్ ఒకటైన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదనిపించుకుంది. కృష్ణవంశీకి చాలా రోజుల తర్వాత మంచి కం బ్యాక్ సినిమాగా నిలిచింది.