టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలతో పాటు యావరేజ్ సినిమాలు.. కొన్ని ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే శక్తి లాంటి డిజాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ సినిమాలలో కచ్చితంగా సూపర్ హిట్ అవ్వాల్సిన కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఎన్టీఆర్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో అశోక్, ఊసరవెల్లి సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కథాపరంగా చూస్తే దమ్మున్న సినిమాలే.
ఈ రెండు సినిమాలలో కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా కొత్తగా ఉంటుంది. అయితే రెండు సినిమాలు ఆశించిన ఫలితాలు సొంతం చేసుకోలేదు. తాజాగా ఊసరవెల్లి సినిమా రిలీజ్ అయ్యి 12 ఏళ్లు అవుతోంది. ఈ సినిమా రిలీజ్ టైంలో మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమా ఆద్యంతం కొత్తగా ఉన్నా ఎన్టీఆర్ పాత్ర డిఫరెంట్ గా ఉన్నా… సెకండాఫ్ లోని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ఆకట్టుకునే లేకపోవటం వల్ల ఈ సినిమా ప్లాప్ రిజల్ట్ అందుకుంది.
ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఉంటే ఈ సినిమా కచ్చితంగా ఎన్టీఆర్ కెరీర్లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ సినిమాలలో ఒకటిగా నిలిచేదని చాలామంది చెబుతూ ఉంటారు. అలాగే ఈ సినిమా ప్లాప్ కావటానికి తమన్నా పాత్రతో చేయించిన ఓవర్ యాక్టింగ్ కూడా కారణమని కొంతమంది అప్పట్లో చెప్పారు. ఎన్టీఆర్ లుక్ చాలా కొత్తగా ఉందని.. ఎన్టీఆర్ యాక్షన్ డైలాగులు అదిరిపోయాయని.. పాటలు కూడా బాగున్నా కేవలం ఫ్లాష్ బ్యాక్.. ఇటు తమన్నా పాత్ర బిహేవియర్ వల్లే సినిమా చతికిల పడిందని చెబుతూ ఉంటారు.
ఊసరవెల్లి సినిమాకు బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత అదే నిర్మాత ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో సినిమా నిర్మించి సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.