Newsఎన్టీఆర్ బామ్మ‌ర్ది నితిన్‌ కుమ్మేశాడు... ' మ్యాడ్ ' డే ఫ‌స్ట్...

ఎన్టీఆర్ బామ్మ‌ర్ది నితిన్‌ కుమ్మేశాడు… ‘ మ్యాడ్ ‘ డే ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు

టాలీవుడ్ యంగ్ హీరోలు నార్నే నితిన్ – రామ్ నితిన్ – సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలలో దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెర‌కెక్కించిన లేటెస్ట్ క్రేజీ కామెడీ డ్రామా మ్యాడ్‌. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా నటించిన ఈ ప్రామిసింగ్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ సినిమా శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందే ఈ సినిమాపై మంచి హైప్‌ వచ్చింది. మ్యాడ్‌కు యూత్ ని ఆకట్టుకునే సాలిడ్ రెస్పాన్స్ కు వచ్చింది.

తొలి రోజు మ్యాడ్‌కు వరల్డ్ వైడ్గా రు. 1.8 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా కంప్లీట్ యూత్ కు బాగా కనెక్ట్ అయిందని చెప్పాలి. తొలి రోజు 1.8 కోట్లు అంటే ఇది సెన్సేషనల్ ఓపెనింగ్ అని చెప్పాలి. యూత్ కి ఎలాగో ఈ సినిమా కనెక్ట్ అయింది. ఇటు ఏపీ, తెలంగాణతో పాటు ఓవర్సీస్ లోను అదిరిపోయే వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.

భీమ్స్ సిసిరోలియా సంగీతం అందించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ – ఫార్చున్‌ 4 సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు. ఈ సినిమా ఫ‌స్ట్ వీకెండ్ ముగిసే స‌రికే వ‌సూళ్ల ప‌రంగా స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంద‌ని అంటున్నారు. ఏదేమైనా బేబీ త‌ర్వాత యూత్‌ను మెప్పించే సినిమాగా మ్యాడ్ నిల‌వ‌నుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news