Newsనితిన్‌కు అక్క‌గా సీనియ‌ర్ హీరోయిన్‌... ఇలా అయిపోయిందేంటి...!

నితిన్‌కు అక్క‌గా సీనియ‌ర్ హీరోయిన్‌… ఇలా అయిపోయిందేంటి…!

ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లు ఇప్పుడు రీఎంట్రీలో అక్క- అత్త-ఆంటీ పాత్రలో నటిస్తున్నారు. రీఎంట్రీ ఇచ్చాక సీనియర్ హీరోయిన్లకు ఒకటి రెండు హిట్ సినిమాలు పడితే వాళ్లకు మామూలుగా డిమాండ్ ఉండటం లేదు. టాలీవుడ్ లో రెండు దశాబ్దాల క్రితం హీరోయిన్ లయ అంటే ఒక క్రేజ్ అచ్చ తెలుగు అమ్మాయి. అందులోను విజయవాడ అమ్మాయి అయిన‌ లయ, వేణు తొట్టింపూడి హీరోగా వచ్చిన స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలలో ఎక్కువ సక్సెస్ లో ఉన్నాయి. వరుస పెట్టి అప్పట్లో మిడిల్ రేంజ్ హీరోలతో పాటు స్టార్ హీరోల సినిమాలలో నటించింది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే గణేష్ అనే ఎన్ఆర్ఐ డాక్టర్ ని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమై అమెరికా వెళ్ళిపోయింది. తన కెరీర్లో 35కు పైగా సినిమాలలో నటించిన లయ గ్లామర్- రొమాన్స్ పాత్రలకు ఏమాత్రం ప్ర‌యార్టీ ఇచ్చేవారు కాదు. చిట్టిపొట్టి దుస్తులు వేసుకొని హీరోల పక్కన ఎగరటం ఆమెకు అస్సలు ఇష్టం ఉండేది కాదు.

ఎప్పుడు కూడా సాంప్రదాయమైన పాత్రలలో నటించేందుకే ఇష్టపడేవారు. చాలా ఏళ్ల తర్వాత శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్లో వచ్చిన అమర్ అక్బర్ అంటోనీ సినిమాలో చిన్న పాత్ర ద్వారా ఆమె రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ల‌య‌తో పాటు ఆమె కూతురు కూడా నటించింది. ప్రస్తుతం తెలుగు యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్న లయ ఇప్పుడు యంగ్ హీరో నితిన్ సినిమాలో నటిస్తోంది.

వేణు శ్రీరామ్- నితిన్ కాంబినేషన్లో తెర్కెక్కుతున్న తమ్ముడు సినిమాలో లయ హీరో నితిన్ అక్క పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గానే ఆమె ఈ సినిమా లొకేషన్ లో కూడా కనపడింది. ఈ సినిమాలో ల‌య‌ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని.. ఈ సినిమా తర్వాత టాలీవుడ్లో మళ్లీ బిజీ అవుతుందని నమ్మకంతో ఉంది. ఏది ఏమైనా 25 ఏళ్ళ క్రితం సినిమాల్లోకి వచ్చినప్పుడు లయ.. ఇప్పుడు ల‌య‌ పోల్చి చూస్తే అస్సలు ఆమె అందం ఏ మాత్రం చెక్కుచెదరలేదన్నట్టుగా కనిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news