టాలీవుడ్ లో సీనియర్ ఎన్టీఆర్.. అప్పటి స్టార్ హీరోయిన్ కృష్ణకుమారి ప్రేమ వ్యవహారం ఒక సెన్సేషనల్. వీరిద్దరి ప్రేమ గురించి అప్పట్లో చాలా ప్రచారం నడిచింది. వీరిద్దరి ప్రేమ వ్యవహారంతో పాటు వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఎన్టీఆర్ తాను కృష్ణ కుమారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయాన్ని తన భార్య బసవతారకం కు చెప్పగా ఆమె కూడా నీ ఇష్టం బావ అంటూ ఎన్టీఆర్కే తన అభిప్రాయాన్ని వదిలేశారు.
భర్త మాటకు ఆమె ఎదురు చెప్పలేదు. ఈ క్రమంలోనే చెన్నైలో వీరిద్దరి పెళ్ళికి ముహూర్తం, వేదిక కూడా ఫిక్స్ అయిపోయాయి. కృష్ణకుమారి తన ఇంట్లో పట్టుచీర కట్టుకుని పెళ్లికూతురుగా ముస్తాబయింది. ఇటు ఎన్టీఆర్ కూడా పట్టు వస్త్రాలు కట్టుకుని పెళ్ళికొడుకు అయ్యారు. ఆరోజు సాయంత్రం ఈ ఇద్దరు పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే బసవతారకం ఈ విషయాన్ని ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమ రావుకు చెప్పారు. వెంటనే త్రివిక్రమరావుకు పట్టరాని కోపం వచ్చింది. అటు అన్నగారికి ఎదురు చెప్పే ధైర్యం చేయలేడు. వెంటనే విజయవాడలో బయలుదేరి కారులో మూడున్నర గంటల్లోనే చెన్నైకు వెళ్ళిపోయారు.
నేరుగా కృష్ణకుమారి ఇంటికి వెళ్లి ఎన్టీఆర్కు పెళ్లి అయ్యి భార్యతో పాటు పిల్లలు ఉన్నారు. ఆయనను ఆంధ్రదేశం అంతా రాముడు, కృష్ణుడుగా కొలుస్తున్నారు. అలాంటి ఆయన రెండో పెళ్లి చేసుకుంటే వాళ్లంతా ఆయనను ఏమనుకుంటారు.. ఆయనపై చెడు అభిప్రాయం కలుగుతుంది.. పెళ్లి ఆలోచన విరమించుకో అని కృష్ణకుమారికి నేరుగానే చెప్పేసారట. కృష్ణకుమారి ఆయనే నన్ను ఇష్టపడ్డారు.. ఆయనే నాతో ఉంటాను అన్నారు అని గట్టుగానే రిప్లై ఇచ్చిందట.
వెంటనే త్రివిక్రమ రావు నువ్వు గతంలో కాంతారావుతో ఉండలేదా ? ఇప్పుడు ఆయన అయిపోయాడు.. ఎన్టీఆర్ కావాలా నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకో.. వెంటనే బెంగళూరు వెళ్ళిపో లేకపోతే నిన్ను కాల్చి చంపి.. నేను కూడా కాల్చుకుంటాను అని బొడ్డులోని పిస్టల్ కూడా బయటికి తీసారట. వెంటనే భయపడిపోయిన కృష్ణకుమారి గంటలోనే పెట్టే బేడా సర్దుకుని బెంగళూరు వెళ్ళిపోయారు. ఆ తర్వాత చాలా రోజులపాటు ఆమె బెంగళూరులోనే ఉన్నారు.
అలా త్రివిక్రమ రావు కృష్ణ కుమారి కి వార్నింగ్ ఇచ్చి ఆరోజు పెళ్లి క్యాన్సిల్ చేయించారని చాలామంది చెబుతూ ఉంటారు. అసలు వాస్తవంగా ఏం జరిగింది ? అనేది పూర్తిగా ఎవ్వరికీ తెలియదు. అయితే ఇదే విషయాన్ని సీనియర్ సినీ జర్నలిస్టు ఈమంది రామారావు లాంటివాళ్ళు కూడా చెబుతూ ఉంటారు.