Moviesలాస్ట్ మినిట్ లో మెగా ఫ్యామిలీకి లావణ్య మదర్ క్రేజీ కండీషన్.....

లాస్ట్ మినిట్ లో మెగా ఫ్యామిలీకి లావణ్య మదర్ క్రేజీ కండీషన్.. ఆ ఇద్దరు పెళ్లికి రాకూడట..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . త్వరలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నిశ్చితార్థం చేసుకున్న ఈయన నవంబర్ ఒకటవ తేదీ గ్రాండ్గా పెళ్లి చేసుకోబోతున్నాడు . ఇప్పటికే పెళ్లి పనులు అన్ని చకచగా పూర్తి చేసేసుకుంటున్నారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతున్నాయి.

అయితే ఇలాంటి క్రమంలోనే వరుణ్ లావణ్య పెళ్లికి మెగా డాటర్ నిహారిక రావడం లేదు అన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అంతేకాదు కావాలని ఆమె పెళ్లికి హాజరు కావడం లేదు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు చాలా డీసెంట్ ఫ్యామిలీ. పద్ధతిగా ఉండాలి అనుకుంటారు .

ఎక్కడ పెళ్ళిలో నిహారిక కనిపిస్తే విడాకుల ప్రస్తావన తీసుకొచ్చి లావణ్య లైఫ్ కూడా అలాగే అవుతుంది అని ట్రోల్ చేస్తారు అన్న భయంతో.. నిహారిక ని పెళ్లికి రావద్దు అంటూ కండిషన్ పెట్టారట. అంతేకాదు శ్రీజ కూడా ఈ పెళ్ళికి అటెండ్ కావడం లేదు అంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . చూద్దాం మరి దీనిపై మెగా కుటుంబం ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news