సీనియర్ నటి కస్తూరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాగార్జున హీరోగా వచ్చిన అన్నమయ్య సినిమాలో నాగార్జున ఇద్దరు మరదల్లలో ఒకరు రమ్యకృష్ణ కాగా.. రెండో మరదలిగా కస్తూరి నటించారు. ఇంత వయస్సు వచ్చినా కస్తూరి అటు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా ఇటు బుల్లితెరపై సీరియల్స్‌తో పాటు వెబ్‌సీరిస్‌లు కూడా చేస్తోంది.
ఇటీవల కాంట్రవర్సీ కామెంట్లు చేస్తోన్న కస్తూరి వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఆమె కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా తమిళంలో ప్రారంభమైన బిగ్‌బాస్ షో గురించి ఆమె మాట్లాడింది. ఈ కార్యక్రమంలోకి తమిళ నటి వనిత విజయ్‌కుమార్ కూతురు జోవిక విజయ్‌కుమార్ కూడా ఎంట్రీ ఇచ్చింది.
తమిళ బిగ్‌బాస్ షో 3లో వనితా విజయ్‌కుమార్‌తో పాటు కస్తూరి శంకర్ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక జోవిక విజయ్‌కుమార్ ఈ షోలో పాల్గొనడంపై కొందరు కస్తూరి శంకర్‌ను స్పందించాలని కోరారు. దీంతో ఆమె మాట్లాడుతూ ఒకే ఇంట్లో చాలా మంది ఉంటే.. వారి ఆర్టిఫిషియల్ పీలింగ్స్ చూపే షోను తాను పట్టించుకోనని చెప్పారు. నాకు అంత టైమ్, ఓపిక, ఇంట్రస్ట్ లేదు.. నాకు నా కుటుంబ బాధ్యత, పనితోనే సరిపోతుందని చెప్పింది.
కస్తూరి కామెంట్లపై నెటిజన్లు ఆమెను ఆటాడేసుకుంటున్నారు. నీకు డబ్బులు కావాల్సినప్పుడు నువ్వు బిగ్‌బాస్ షోలోకి వెళ్లలేదా ? ఇప్పుడు నీతి కబుర్లు చెపుతున్నావు.. అయినా నీకు గంటకు రు. 5 వేలు వస్తాయిగా.. అని దారుణమైన అర్థంలో కామెంట్ చేశాడు. దీనిపై కస్తూరి స్పందిస్తూ నిన్ను మీ ఇంట్లో వాళ్లు ఇలాగే పెంచారా.. నీకు సిగ్గులేదా ? అని ఫైర్ అయ్యింది.