Newsప‌వ‌న్ తొలిప్రేమ కీర్తిరెడ్డి రెండో భ‌ర్త ఎవ‌రు ? క‌ళ్లు చెదిరే...

ప‌వ‌న్ తొలిప్రేమ కీర్తిరెడ్డి రెండో భ‌ర్త ఎవ‌రు ? క‌ళ్లు చెదిరే బ్యాక్‌గ్రౌండ్‌…!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు తక్కువ సినిమాలు చేసిన మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి నటీమణులలో తొలిప్రేమ కీర్తి రెడ్డి ఒకరు. ఆలీ హీరోగా వచ్చిన గన్ షాట్ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన కీర్తిరెడ్డి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాతో టాలీవుడ్ లోనే ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతులు మిగిల్చారు. ఆ తర్వాత నాగార్జున రావోయి చందమామతో పాటు కొన్ని సినిమాలలో నటించారు కీర్తిరెడ్డి. అర్జున్ సినిమాలో మహేష్ బాబు చెల్లిగా కూడా నటించారు.

ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తొలిప్రేమలో ఆమె నటన తెలుగు ప్రేక్షకులను ఎప్ప‌ట‌కీ మ‌ర్చిపోలేనంత‌గా ఫిదా చేసింది. తొలిప్రేమ సినిమా వచ్చి రెండున్నర దశాబ్దాలు అవుతున్న ఇప్పటికీ తొలిప్రేమ కీర్తిరెడ్డి అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ఆ సినిమాతో ఆమె అంతలా చెరగని ముద్ర వేసింది. కీర్తి రెడ్డి 2004లో అక్కినేని మనవడు సుమంత్ ను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత మనస్పర్ధలు తలెత్తడంతో ఏడాది లోపల వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

సుమంత్ కు విడాకులు ఇచ్చేశాక కీర్తిరెడ్డి బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలు.. భర్తతో కలిసి ఆమె అమెరికాలో ఉంటున్నారు. కీర్తి రెడ్డిది బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావ‌టం విశేషం. ఆమె తాత గడ్డం గంగారెడ్డి నిజామాబాద్ నుంచి లోక్‌స‌భకు ఎంపికయ్యారు. కీర్తి రెడ్డి తండ్రి కూడా ముందు బిఆర్ఎస్ లో పనిచేసి ఆ తర్వాత బిజెపి తరఫున నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

కీర్తి రెడ్డి తండ్రి ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న కీర్తిరెడ్డి తెలుగులో స్టార్ హీరోల సినిమాలలో అక్క, అక్క పాత్రలతో రీయంట్రీ ఇచ్చేందుకు వెయిట్ చేస్తున్నారు. కీర్తిరెడ్డి తెలుగు ప్రేక్షకుల హృదయంలో ఎప్పటికీ పాపులర్. ఆమెకు రీఎంట్రీలో సరైన సినిమా పడితే వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం ఉండదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news