Moviesవామ్మో.. ఈ అవ్వ ని కూడా గెస్ట్ హౌస్ కి రమ్మన్నారా..?...

వామ్మో.. ఈ అవ్వ ని కూడా గెస్ట్ హౌస్ కి రమ్మన్నారా..? ఏం పోయే కాలం రా మీకు..?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వసాధారణమే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక సినిమాలో ఒక రోల్ కావాలి అంటే కచ్చితంగా సదురు సినిమాకి సంబంధించిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ మేకర్స్ ఎవరో ఒకరి కోరిక తీర్చాలి .. అప్పుడే ఆ సినిమాలో అవకాశం వస్తుంది అంటూ క్యాస్టింగ్ కౌచ్ కి బలైన బాధితులు చెప్పుకొస్తూ ఉంటారు . అయితే రీసెంట్గా నటి ప్రమీల రాణి సైతం అదే విషయాన్ని కన్ఫామ్ చేసింది .

45 ఏళ్లుగా ఇండస్ట్రీలో నటిస్తూనే ఉన్న ఈమెను కూడా క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఇబ్బంది పెట్టారట. 85కు పైగా సినిమాలో నటించిన ప్రమీల రాణి.. ఇటీవల ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న కష్టాలను ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకునింది . “వద్దు బావ తప్పు” అనే సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన ఈమె పలు అనారోగ్య కారణాలతో బాధపడుతుందట . డాక్టర్స్ పిల్లలు పుట్టరని చెప్పారన్న నెపంతో భర్త వదిలిపెట్టేసారట . అంతేకాదు ఆ తర్వాత బాబురావు అనే వ్యక్తిని ప్రమీల పెళ్లాడారు . అప్పటికే ఆయనకు పెళ్లయిందని ఆమెకు తెలియదట .

ఆ తర్వాత ప్రమీలకి కొడుకు పుట్టాడు . 23 ఏళ్ల కిందట రెండవ భర్త బాబురావు చనిపోయాడట . అంతేకాదు పలు సినిమాల్లో కీలక రోల్స్ నటించిన ప్రమీల రాణి ఇండస్ట్రీలో చేదు అనుభవాలను ఎదుర్కొందట. ఓ సినిమాలో ఛాన్స్ ఇస్తాను అంటూ చెప్పి అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి గెస్ట్ హౌస్ కి రమ్మన్నారు అంటూ ప్రమీల రాణి సంచలన విషయాన్ని బయట పెట్టింది . వారు తీరు నచ్చకే ఆ సినిమా అవకాశాన్ని వదిలేసుకున్నాను అంటూ కూడా చెప్పుకొచ్చింది. దీంతో ఇదే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news